02-05-2025 12:29:07 AM
వాడవాడన ఘనంగా మేడే సంబురాలు
ప్రభుత్వ కార్మిక వ్యతిరేక విధానాలపై గళం విప్పిన నాయకులు
సూర్యాపేట, మే 1 (విజయక్రాంతి): శ్రమజీవుల సంబరాలు జిల్లా వ్యాప్తంగా అంబరాన్నంటాయి. మేడేను పురస్కరించు కుని గురువారం పల్లె, పట్నం అంతట అరుణవర్ణం సంతరించుకున్నాయి. జిల్లా వ్యాప్తంగా వామపక్షాలతో పాటు కాంగ్రెస్, బీఆర్‌ఎస్, కార్మిక సంఘాలు, ప్రజాసంఘాల ఆధ్వర్యంలో మేడే వేడుకలను నిర్వహించారు. ఈ సందర్భంగా భారీ ర్యాలీలు, జెండాల ఆవిష్కరణలతో కార్మికలోకం కదంతొక్కింది. నినాదాలతో హోరెత్తింది.
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్న సరళీకరణ, ప్రపంచీకరణ విధానాలపై ఉద్యమించాలని వామపక్ష కార్మిక సంఘాల నాయకులు పిలుపునిచ్చారు. కార్మికులకు 8గంటల పనివేళలు అమలు చేయాలని, సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని, కార్మికులకు ఫిఎఫ్, ఈఎస్‌ఐ, వారాంతపు సెలవులు ప్రకటించాలని కోరారు. అర్హత కలిగిన వారిని పర్మినెంట్‌ౌ కార్మికులుగా గుర్తించాలని, అసంఘటితరంగ కార్మికులకు పెన్షన్Sతో కూడిన సమగ్ర సంక్షేమ చట్టం చేయాలని కోరారు.
సీపీఎం ఆద్వర్యంలో..
ప్రపంచ మానవాళికి దోపిడి నుండి విముక్తి మార్గం కలిగించేది ఎరజ్రెండా పోరాటాలె అని కార్మికులు, కర్షకులు తమ హక్కుల సాధన కోసం ఐక్యంగా పోరాడాలని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యురాలు మల్లు లక్ష్మి అన్నారు. ఈరోజు మేడే సందర్భంగా సిపిఎం జిల్లా కార్యాలయంలో అమె ఎరజ్రెండా ఎగురవేశారు.
సీపీఐ(ఎం,ఎల్) మాస్ లైన్ ఆద్వర్యంలో...
మేడే స్పూర్తితో కార్మికుల హక్కులకై పోరాడాలని సీపీఐ(ఎం.ఎల్) మాస్ లైన్ జిల్లా కార్యదర్శి కొత్తపల్లి శివ కుమార్ పిలుపునిచ్చారు. 139వ మే డే సందర్భంగా సూర్యాపేట జిల్లా కేంద్రంలోని విక్రమ్ భవన్ ముందు మాస్ లైన్ పార్టీ జెండాను పార్టీ జిల్లా కార్యదర్శి కొత్తపల్లి శివకుమార్, మేడే జెండాను టియుసిఐ జిల్లా నాయకులు ఎస్కే సయ్యద్కారింగుల వెంకన్న, శేషగిరిలతో మేడే జెండాను ఆవిష్కరించారు.
న్యూ డెమోక్రసీ, ఐఎఫ్‌టీయూ ఆధ్వర్యంలో
139వ మే డే సందర్భంగా సిపిఐ (ఎంఎల్) న్యూ డెమోక్రసీ, ఐ ఎఫ్ టి యు ఆధ్వర్యంలో సూర్యాపేట పట్టణంలో పలు కేంద్రాలలో అరుణ పతాకాలు ఎగరవేయ డం జరిగింది. చంద్ర పుల్లారెడ్డి విజ్ఞాన కేంద్రం వద్ద న్యూ డెమోక్రసీ జిల్లాకార్యదర్శి మండారి డేవిడ్ కుమార్, నూతనకల్ రోడ్డు వద్ద ఐ ఎఫ్ టుయూ జిల్లా ఉపాధ్యక్షుడు కునుకుంట్ల సైదులు, రాఘవేంద్ర ఐరన్ షాప్ వద్ద పురుషోత్తం, కుడకుడ రోడ్డులో జలగం వెంకన్న, కొత్త బస్టాండ్ వద్ద ఎస్ కే నజీర్, రిజిస్ట్రేషన్ ఆఫీస్ దగ్గరలో బండి రవి అరుణ పతాకాలు ఎగురవేశారు.
గ్రామ గ్రామాన మేడే వేడుకలు
నాగారం మే 01 :నాగారం మండల పరిధిలోని అన్ని గ్రామాలలో కార్మిక సంఘాల ఆధ్వర్యంలో గురువారం మేడే ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మండల కేంద్రంలో సిపిఎం పార్టీ సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ హమాలి కార్మిక సంఘం ఎలక్ట్రిషన్ యూనియన్ పెయింటర్స్ యూనియన్ ఆధ్వర్యంలో మేడే జెండాలను ఎగరవేశారు. ఈ కార్యక్రమంలో పులుసు సత్యం డి. యాదగిరి సంపేట కాశయ్య బొడ్డు శంకర్ జాజుల సామేల్ పెయింటర్స్ యూనియన్ అధ్యక్షులు వంగూరి కుమార్ ఎలక్ట్రిషన్ యూనియన్ అధ్యక్షులు జానీ పాషా వీరయ్య తదితరులు పాల్గొన్నారు.
మేడే స్ఫూర్తి కొనసాగిద్దాం
యాదాద్రి భువనగిరి: ప్రపంచ కార్మిక దినోత్సవం 139 మే డే సందర్భంగా భువనగిరి జిల్లా సిపిఎం కార్యాలయంలో పార్టీ పతాకాన్ని జిల్లా కార్యదర్శి ఎం డి జహంగీర్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రపంచ శ్రామిక జనావళి ని ఒక్కతాటిపై నడిపిన చరిత్ర మేడే ది అని అన్నారు. ధన, దోపిడి శక్తులను తుదమొట్టించి 8 గంటల పనిదినాన్ని సాధించి కార్మికుల జీవితాల్లో వెలుగు నింపిన ఎర్రజెండా అమరుల త్యాగాల చరిత్రను నేడు బిజెపి చెరిపివేయాలని చూస్తున్నదని ఆరోపించారు. సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు కొండమడుగు నరసింహ, బట్టుపల్లి అనురాధ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు మాటూరి బాలరాజు, కల్లూరి మల్లేశం, దాసరి పాండు, జిల్లా కమిటీ సభ్యులు కోమటిరెడ్డి చంద్రారెడ్డి, మాయ కృష్ణ, గడ్డం వెంకటేష్, మరియు ఈర్లపల్లి ముత్యాలు, లావుడియా రాజు, గందమల్ల మాతయ్య,బోడ భాగ్య, లలిత, యడి.సలీం, ఆఫీస్ కార్యదర్శి వల్లబుదాసు రాంబాబు తదితరులు పాల్గొన్నారు.
హుజూర్‌నగర్‌లో..
హుజూర్ నగర్, మే 1: హుజూర్నగర్ పట్టణంలోని లింగగిరి రోడ్ లో శ్రీ శ్రీ విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి ఆలయం దగ్గర కార్పెంటర్స్ యూనియన్ ఆధ్వర్యంలో మే డే ఉత్సవాలను ఘనంగా నిర్వహించడం జరిగింది. కార్పెంటర్స్ యూనియన్ ఏర్పాటు అయిన తర్వాత మొదటిసారిగా హుజూర్నగర్ పట్టణంలో మేడే ఉత్సవాలను కార్పెంటర్ సోదరులు ఘనంగా నిర్వహించి అనంతరం విశ్వబ్రాహ్మణ జెండా చేతభూని హుజూర్నగర్ కొత్త బస్టాండ్ వరకు ర్యాలీనిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో గౌరవాధ్యక్షులు చేపూరి నరసింహ చారి, రాగి శ్రీనివాసచారి అధ్యక్షులు బ్రహ్మచారి కార్యదర్శి, దేసోజుఉపేంద్ర చారి కోశాధికారి, రాగి రాజశేఖర్,బంగారు బ్రహ్మచారి నాగాచారి,ఆర్ శ్రీనివాస చారి, కేశవరపు బ్రహ్మచారి, నెమోజు నరేష్ చారి, శివ చారి,సంపత్ చారి,మంగాచారి వెంకటాచారి తదితరులు పాల్గొన్నారు.
వాడవాడల మే డే ఉత్సవాలు
యాదాద్రి భువనగిరి, మే 1 (విజయ క్రాంతి): మే డే స్ఫూర్తితో నరేంద్ర మోడీ కార్మిక వ్యతిరేక విధానాలపై ఐక్య పోరాటాలకు సిద్ధం కావాలని సిఐటియు జిల్లా కార్యదర్శి కల్లూరి మల్లేశం అన్నారు. ఆలేరు పట్టణంలో సిఐటియు ఆధ్వర్యంలో దుర్గమ్మ గుడి నుండి కాటమయ్య బస్తి వరకు భారీ ఎత్తున నినాదాలు చేస్తూ ర్యాలీ నిర్వహించారు. అనంతరం సిఐటియు జిల్లా కమిటి సభ్యులు మొరిగాడి రమేష్ అధ్యక్షతన సభ జరిగింది.
కార్యక్రమంలో ఆవాజ్ జిల్లా అధ్యక్షులు ఎంఏ ఇక్వాల్, గీత సంఘం జిల్లా నాయకులు దూపటీ వెంకటేష్ ,సిఐటియు మండల కన్వీనర్ సంఘీ రాజు ,వడ్డేమాన్ బాలరాజు పిఎసిఎస్ మాజీ చైర్మన్ మొరిగాడి చంద్రశేఖర్ తాళ్లపల్లి గణేష్ బొప్పిడి యాదగిరి చేన్న రాజేష్ అంగన్వాడి నాయకులు సాటిక అనురాధ పద్మ మోరీగాడి శారద రుద్రవేణి సరిత హమాలీ కార్మిక సంఘం నాయకులు అంగిరేకుల సత్యం గోపాల జగన్ పేర బోయిన కృష్ణ జోగు కుమార్ బుజ్జా ఐలయ్య గ్రామపంచాయతీ కార్మిక సంఘం నాయకులు సిరబోయిన రాంనర్సయ్య తండా సుగుణ నర్సింగరావు మహేందర్ గౌతమి ఎక్స్పో్లజివ్ కార్మికులు దూడల శ్రీధర్ వీరేశం మిషన్ భగీరథ యూనియన్ నాయకులు సంపత్ , కుమార స్వామి , యాదయ్య , యువజన సంఘం నాయకులు యువజన సంఘం నాయకులు చింతల నాగరాజు వడ్డేమాన్ విప్లవ్ మద్దెల కుమార్ చెక్క పరశురాములు గాడి పెళ్లి ప్రశాంత్ ఎండి మతిన్ ఎండి అమీర్ బర్ల సిద్దులు మిట్ట శంకరయ్య యాసారపు ప్రసాద్ మొరిగాడి గాడి అశోక్ మొరిగాడి అంజయ్య కాలువ కాడి రాజు రాచర్ల సిద్ధులు మోరీగాడి రాజు తదితరులు పాల్గొన్నారు