02-05-2025 12:26:34 AM
కొనుగోలు కేంద్రాలను సందర్శించిన జిల్లా కలెక్టర్
గోపాలపేట మే 1 : గోపాలపేట మండలంలోని బుద్ధారం చెన్నూరు తాడిపత్రి గోపాలపేట్ గ్రామాలలో ప్రభుత్వం ఏర్పా టు చేసిన వరి ధాన్య కొనుగోలు కేంద్రాలను గురువారం వనపర్తి జిల్లా అదనపు కలెక్టర్ వెంకటేశ్వర్లు సందర్శించారు. తేమ వచ్చిన వెంటనే కొనుగోలు చేసి ధాన్యాన్ని గోదాములకు తరలించాలని ఆదేశించారు. అవస రమైతే అందుబాటులో ఉన్నా ట్రాక్టర్లలో ధాన్యాన్ని మిల్లులకు తరలించాలని సూచించారు.
ట్రాక్టర్లలో తరలించిన ధాన్యం ముం దుగా దించుకోవాలని సూచించారు. త్వరలోనే లారీ ల సమస్య తీరుతుందని అంతవ రకు ట్రాక్టర్లను సైతం వాడుకోవాలని సూ చించారు. అదేవిధంగా లారీలు పెట్టడంలో ఆలస్యం చేయవద్దని సూచించారు.