calender_icon.png 1 May, 2025 | 9:32 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కార్మిక కర్షకుల హక్కుల పోరాట ఫలితమే మే డే

01-05-2025 05:15:47 PM

శ్రమకు తగ్గ ఫలితం దక్కినంతవరకు పోరాటాలకు సిద్ధం కావాలి..

సిపిఐ ఏఐటీయూసీ ఆధ్వర్యంలో ఘనంగా మేడే ఉత్సవాలు..

రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి గురిజ రామచంద్రం, ఏఐవైఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి తీర్పారి వెంకటేశ్వర్లు..

మునుగోడు (విజయక్రాంతి): కార్మిక కర్షకుల హక్కుల పోరాట ఫలితమే మేడే అని రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి గురిజ రామచంద్రం, ఏఐవైఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి తీర్పారి వెంకటేశ్వర్లు అన్నారు. గురువారం ప్రపంచ కార్మిక దినోత్సవం మే డే సందర్భంగా మునుగోడు మండల కేంద్రంలో సిపిఐ అనుబంధ కార్మిక సంఘాలు ఏఐటీయూసీ, మిల్లు హమాలీ కార్మిక సంఘం, భవన, చిరు వ్యాపారాల సంఘాల ఆధ్వర్యలో మేడే ఉత్సవాలను జెండాలు ఎగురవేసి ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ... కార్మిక కర్షక హక్కుల సాధన కోసం 139 సంవత్సరాలుగా పోరాడుతున్నది జెండా ఎర్ర జెండా అని గుర్తు చేశారు.

కేంద్రంలోని బిజెపి ప్రభుత్వంకార్మికుల హక్కులను కాలరాస్తున్నాయని లేబర్ కోడుల పేరుతో కార్మిక చట్టాలను తొలగిస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. కార్పొరేటు సంస్థలు కార్మికుల శ్రమ ను దోపిడీ చేస్తున్నారని ఆరోపించారు.కేంద్ర ప్రభుత్వం ప్రభుత్వాలు కార్పొరేటు పారిశ్రామిక రంగాలకి కొమ్ముకాస్తున్నాయని ఆరోపించారు.శ్రమకు తగ్గ ఫలితం దక్కేంతవరకు పోరాటాలకు సిద్ధం కావాలని ఈ సందర్భంగా పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా కౌన్సిల్ సభ్యులు సురిగి చలపతి, పార్టీ మండల కార్యదర్శి చాపల శ్రీను, గోసుకొండ లింగయ్య, బండమీది యాదయ్య, మందుల పాండు, దుబ్బ వెంకన్న, బెల్లం శివయ్య, ఈదులకంటి కైలాస్ ,జానీ, కురుమర్తి ముత్తయ్య, నందిపాటి అశోక్,సత్యనారాయణ, ధాం ఖాసిం, వార్రే ముత్తయ్య, బోయపర్తి యాదయ్య, పందుల చిన్న నరసింహ , బేమనపల్లి స్వామి, గిరి,ప్రేమలత, అండాలు, రేణుక, యట పద్మ, కట్ట దశరథ, పులకరం ఆంజనేయులు, చాపల విప్లవ్ కుమార్, రమేష్ బొడ్డు వినోద్ ఉన్నారు.