01-05-2025 05:13:14 PM
తెలంగాణ ఉద్యమకారుల మండల ఉపాధ్యక్షుడు ఆనగంటి కృష్ణ...
మునుగోడు (విజయక్రాంతి): తెలంగాణ ఉద్యమకారులకు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు పరచకపోతే ఆమరణ నిరాహార దీక్షకు సిద్ధంగా ఉన్నామని తెలంగాణ ఉద్యమకారుల మండల ఉపాధ్యక్షుడు ఆనగంటి కృష్ణ హెచ్చరించారు. గురువారం మండల కేంద్రంలో ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన తెలంగాణ ఉద్యమకారులకు 250 గజాల ఇంటి స్థలంతో పాటు ఇందిరమ్మ ఇండ్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు.
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో వచ్చిన వెంటనే తెలంగాణ ఉద్యమకారులకు ఇచ్చిన మాట తప్పకుండా నెరవేర్చాలని, లేనియెడల త్వరలో అమర నిరాహార దీక్ష చేస్తామని అన్నారు. గత ప్రభుత్వం పది సంవత్సరాలు అధికారంలో ఉన్న ఉద్యమకారులను పట్టించుకోలేదు, ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొన్నారు. తమ ప్రాణాలు లెక్కచేయకుండా తెలంగాణ ఉద్యమ కోసం ఎంతో పోరాటం చేశామని అన్నారు. ఉద్యమకారుల హామీలను ఆశయాలను నెరవేర్చాలని ప్రభుత్వాన్ని కోరారు.