calender_icon.png 2 May, 2025 | 1:03 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బీజేపీతోనే దేశం సుభిక్షం

01-05-2025 05:22:02 PM

‌‌రిటైర్డ్​ కర్నల్​ డాక్టర్​ మాచర్ల భిక్షపతి..

జనగామ (విజయక్రాంతి): బీజేపీ పాలనతోనే దేశం సుభిక్షంగా ఉంటుందని రిటైర్డ్​ కర్నల్​ డాక్టర్​ మాచర్ల భిక్షపతి అన్నారు. గురువారం ఆయన బీజేపీ జిల్లా అధ్యక్షుడు సౌడ రమేశ్​ చేతులమీదుగా జిల్లా పార్టీ కార్యాలయంలో బీజేపీ క్రియాశీలక సభ్యత్వం స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఉగ్రవాదాన్ని, తీవ్రవాదాన్ని అణిచివేయడంలో మోడీ సర్కార్ కృత నిశ్చయంతో పనిచేస్తుందని కొనియాడారు. ఎక్కడా లేని విధంగా బహుజనులు, దళితులకు అధిక ప్రాధాన్యం ఇస్తున్న బీజేపీకే దక్కిందన్నారు. జై జవాన్​, జై కిసాన్​ నినాదంతో బీజేపీ పాలన సాగుతోందన్నారు. ప్రధాని మోడీ నేతృత్వంలో దేశంలో అభివృద్ధి, సంక్షేమం సముపాళ్లలో నడుస్తున్నాయని చెప్పారు.