calender_icon.png 3 September, 2025 | 10:39 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఎంక్వయిరీల పేరుతో నేతన్నలు అయోమయం

03-09-2025 07:55:06 PM

నల్గొండ మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి

ఏ ఒక్క కార్మికుడు కూడా అధైర్య పడవద్దు

నల్గొండ టౌన్,(విజయక్రాంతి): కాంగ్రెస్ ప్రభుత్వం ఎంక్వయిరీల పేరుతో నేతన్నలను అయోమయానికి గురి చేస్తుందని, అర్హులైన కార్మికులను ఈ పథకంలో చేరకుండా ఈ ప్రభుత్వం కుట్ర చేస్తోందని మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి బుధవారం ఒక పట్టణంలో  ఆగ్రహించారు. అందాల భామల కోసం ఒక్క రాత్రి విందుకే దాదాపు 35 కోట్ల రూపాయలు ఖర్చుపెట్టిన ఈ రేవంత్ రెడ్డి సర్కార్ అర్ధాకలితో అలమటిస్తున్న ఈ నేత కార్మికులను్ హరిగోస పెట్టిస్తుందని, చేనేత పొదుపు పథకానికి రాష్ట్ర మొత్తంలో కూడా దాదాపు 30 కోట్లు కూడా కావని అయినా కూడా ఈ ప్రభుత్వం ఎందుకు నేతన్నల బతుకులతో ఆటలాడుతుందని ఆయన తీవ్రస్థాయిలో మండిపడ్డారు.

ఎంక్వయిరీల పేరుతో నిజమైన అర్హులను నేతన్న పొదుపు పథకంలో చేరకుండా కుట్రలు చేస్తే సహించేది లేదని వారికి అండగా ఈ కంచర్ల భూపాల్ రెడ్డి గారు ఉన్నానని, ఏ ఒక్క కార్మికుడు కూడా అధైర్య పడవద్దు అని ఆయన పవర్లూమ్ కార్మికులకు విజ్ఞప్తి చేశారు.పొదుపు పథకం ద్వారా అర్హులైన ప్రతి నేత కార్మికునికి న్యాయం చేయాలని నల్గొండ జౌళి శాఖ ఉన్నతాధికారులను ఆయన కోరారు.