03-09-2025 08:05:05 PM
గంభీరావుపేట,(విజయక్రాంతి): మండల కేంద్రంలోని రెండవ వార్డు, సీతారాం బజార్ బ్రాహ్మణ వీధిలో తాగునీటి సమస్యను పరిష్కరించేందుకు మూడు బోర్లు మోటర్లు ఏర్పాటు చేశారు. బుధవారం మండల కాంగ్రెస్ అధ్యక్షుడు హామీద్ ఆధ్వర్యంలో జెడ్పి నిధులతో రూ.4.50 లక్షల వ్యయంతో ఈ బోర్లు వేసి, కొబ్బరికాయ కొట్టి ప్రారంభించారు. తాగునీటి సమస్యను తన దృష్టికి తీసుకువెళ్లగానే వెంటనే స్పందించి కలెక్టర్ ద్వారా నిధులు మంజూరు చేయించారని కాలనీవాసులు హామీద్‌కు కృతజ్ఞతలు తెలిపారు.