calender_icon.png 3 September, 2025 | 10:39 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

జూనియర్ కళాశాలలో సరస్వతి బాయి పూలే విగ్రహావిష్కరణ

03-09-2025 07:49:48 PM

సంగారెడ్డి (విజయక్రాంతి): వాసవి మా ఇల్లు - స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో బుధవారం సంగారెడ్డి జూనియర్ కళాశాలలో సావిత్రిబాయి పూలే విగ్రహాన్ని ఆవిష్కరించారు. కీ.శే. తోపాజి ఈశ్వరయ్య, పద్మావతి జ్ఞాపకార్థం వారి పుత్రుడు, మా ఇల్లు సంస్థ వ్యవస్థాపక అధ్యక్షులు తోపాజి అనంత కిషన్ మొట్ట మొదటి మహిళా ఉపాధ్యాయురాలు సరస్వతి బాయి పూలే విగ్రహాన్ని ఆవిష్కరింపజేయడం చాలా సంతోషంగా ఉందని విగ్రహాన్ని ప్రారంభించిన ముఖ్య అతిథి, టిజిఐసిసి చైర్మన్, నిర్మలా జయప్రకాష్ రెడ్డి తెలియజేశారు. మా ఇల్లు అధ్యక్షులు తోపాజి అనంత కిషన్ మాట్లాడుతూ, ఇంతమంది జూనియర్ కళాశాల విద్యార్థినులకు సరస్వతీబాయి పూలే విగ్రహం ఒక స్ఫూర్తిని నింపుతుందని అన్నారు.

ఈ కార్యక్రమంలో రాష్ట్ర యువజన సంఘాల కార్యదర్శి కూన వేణుగోపాల్ మాట్లాడుతూ, తోపాజి సేవలు అభినందనీయమని అన్నారు. ఇంటర్మీడియట్ జిల్లా అధికారి గోవిందరాజు, కళాశాల ప్రిన్సిపల్ సునీత మాట్లాడుతూ, విగ్రహాన్ని నెలకొల్పడానికి సంగారెడ్డి మహిళా జూనియర్ కాలేజీనీ ఎంచుకోవడం ఆనందదాయకమని అన్నారు, ఈ కార్యక్రమంలో విశిష్ట అతిథిగా జిల్లా అడిషనల్ కలెక్టర్ మాధురి, మా ఇల్లు సంస్థ ప్రధాన కార్యదర్శి పుల్లూరి ప్రకాష్, కళింగ కృష్ణకుమార్, తోపాజి తేజోవతి, తోపాజి హరీష్, పట్టణ ప్రముఖులు మ్యాడమ్ రాధాకిషన్, జూలకంటి బుచ్చిలింగం, మిరియాల పాండురంగం, రాచర్ల ప్రసాద్, చంద్రిక కరుణాకర్, సుధాకర్, గంగేరి శ్రీహరి, చంద్ర శేఖర్, కటుకం విజయ్, కొంపల్లి విద్యాసాగర్, అనుముల సంతోష్, నామా భాస్కర్, ఇరుకుళ్ళ ప్రదీప్ కుమార్, ఆమేటి మహేందర్ తదితరులు పాల్గొన్నారు.