03-09-2025 07:57:11 PM
గురుకుల పాఠశాలను తనిఖీ చేసిన కలెక్టర్
మహబూబాబాద్ (విజయక్రాంతి): విద్యాబోధన ఎలా జరుగుతోంది.. హాస్టల్లో నూతన మెనూ అమలు చేస్తున్నారా అంటూ విద్యార్థులను మహబూబాబాద్ జిల్లా కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్(District Collector Adwait Kumar Singh) అడిగి తెలుసుకున్నారు. బుధవారం జిల్లా కేంద్రంలోని గుమ్ముడూరు మహాత్మా జ్యోతిబాపులే తెలంగాణ వెనుకబడిన తరగతుల సంక్షేమ గురుకుల పాఠశాలను జిల్లా కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్బంగా కలెక్టర్ గురుకులంలో కలియతిరిగి వంటగదిని పరిశీలించి మెనూ ప్రకారం పరిశుభ్రమమైన వేడి ఆహారాన్ని విద్యార్థులకు అందించాలన్నారు. పాఠశాల ఆవరణ పరిశుభ్రంగా ఉంచాలన్నారు. విద్యార్థులకు అర్థమయ్యే విధంగా విద్యా బోధన చేయాలన్నారు. షెడ్యుల్ వారిగా సిలబస్ పూర్తి చేయాలని, అనంతరం విద్యార్థుల యొక్క సామర్థ్యాలను పరీక్షించాలన్నారు. ఈ సందర్భంగా తరగతి గదిలోని విద్యార్థుల యొక్క అభ్యసన సామర్థ్యాలను పరిశీలించారు. విద్యార్థుల హాస్టల్ గదులను పరిశీలించి చుట్టూ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలని అన్నారు.