calender_icon.png 3 September, 2025 | 10:48 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కల్యాణ లక్ష్మి – సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల పంపిణీ

03-09-2025 08:02:18 PM

గంభీరావుపేట,(విజయక్రాంతి): మండల కేంద్రంలోని గాయత్రి ఫంక్షన్ హాల్‌లో బుధవారం రోజున ఎమ్మార్వో మారుతి రెడ్డి ఆధ్వర్యంలో లబ్ధిదారులకు చెక్కుల పంపిణీ జరిగింది. ఈ సందర్భంగా కల్యాణ లక్ష్మి పథకంలో 94 మందికి, సీఎం రిలీఫ్ ఫండ్‌లో 56 మందికి, మొత్తం రూ.1.96 కోట్లు పంపిణీ చేసినట్టు అధికారులు తెలిపారు.

ఏఎంసీ చైర్మన్ కొమ్మిరిశెట్టి విజయ మాట్లాడుతూ ఇందిరమ్మ ఇండ్లు, రేషన్ కార్డులు, సన్నబియ్యం వంటి పథకాలను కాంగ్రెస్ ప్రభుత్వం విజయవంతంగా అమలు చేస్తూ పేదలకు అండగా నిలుస్తుందన్నారు. చెక్కుల మంజూరులో కృషి చేసిన ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, సిరిసిల్ల నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్‌చార్జి కేకే మహేందర్ రెడ్డిలకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు.