03-09-2025 07:51:12 PM
చండూరు,(విజయక్రాంతి): పేదింటి ఆడపడుచులకు కళ్యాణ లక్ష్మి పథకం ఒక వరం లాంటిదని చండూర్ తహసిల్దార్ చంద్రశేఖర్, చండూరు మార్కెట్ కమిటీ చైర్మన్ దోటి నారాయణ అన్నారు. చండూరు మండల కేంద్రంలోని మండల తహసిల్దార్ కార్యాలయం వద్ద కళ్యాణ లక్ష్మి చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కళ్యాణ లక్ష్మి పథకాన్ని పేదింటి ఆడపడుచులందరూ సద్వినియోగం చేసుకోవాలని ఆయన అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను వినియోగించుకోని ఆర్థికంగా లబ్ధి పొందాలన్నారు.
పేదింటి యువతుల వివాలకు ఈ పథకం ఎంతో లబ్ధి చేకూరుస్తున్నాయన్నారు.ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ పోలే వెంకట్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు కొరిమి ఓంకారం, ట్రస్మా జిల్లా అధ్యక్షులు కోడి శ్రీనివాసులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు గజ్జల కృష్ణారెడ్డి, రెవిన్యూ అధికారులు అజయ్, లింగస్వామి, రజనీకాంత్, మార్కెట్ కమిటీ డైరెక్టర్లు, ఇతర నాయకులు లబ్ధిదారులు తదితరులు పాల్గొన్నారు.