calender_icon.png 3 September, 2025 | 10:48 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కంటి వైద్య నిపుణుడికి సన్మానం

03-09-2025 08:16:35 PM

బెల్లంపల్లి,(విజయక్రాంతి): బెల్లంపల్లి పట్టణంలోని శాంభవి కంటి దవఖాన డాక్టర్ కొంకటి అంజయ్యను బుధవారం 28వ వార్డు మాజీ కౌన్సిలర్ డి.పూలమ్మ ఘనంగా సన్మానించారు. గత 12 సంవత్సరాలుగా బెల్లంపల్లి ప్రాంత ప్రజలకు ఉచితంగా కంటి ఆపరేషన్లు నిర్వహిస్తూ తక్కువ ఖర్చుతో కంటి అద్దాలను అందజేస్తున్నందుకుగాను కొంకటి అంజయ్య సన్మానించారు. లయన్స్ క్లబ్ ఆఫ్ ఇంటర్నేషనల్, వాసవి క్లబ్, తాజ్ బాబా సేవ సంస్థల ద్వారా పేదలకు కంటి పరీక్షలు చేస్తున్న అంజయ్యను సన్మానించడం సంతోషంగా ఉందని ఆమె అన్నారు.