11-06-2025 12:10:34 AM
సంస్థాన్ నారాయణపూర్, జూన్ 10 (విజయక్రాంతి): సంస్థాన్ నారాయణపురం మండల కేంద్రంలో బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు జాజుల శ్రీనివాస్ గౌడ్ పుట్టినరోజు వేడుకలను ఘనంగా నిర్వహించారు. బీసీ సంక్షేమ సంఘం మునుగోడు నియోజకవర్గం అధ్యక్షులు వీరమల్ల కార్తీక్ ఆధ్వర్యంలో స్థానిక చౌరస్తాలో కేక్ కట్ చేసి పండ్లు పంపిణీ చేసి శుభాకాంక్షలు తెలిపారు.
ఈ సందర్భంగా కార్తీక్ గౌడ్ మాట్లాడుతూ బీసీల హక్కుల కోసం నిరంతరం పోరాటం చేస్తూ దేశవ్యాప్తంగా బీసీల ఉనికిని చాటిన గొప్ప వ్యక్తి జాజుల శ్రీనివాస్ గౌడ్ అన్నారు. బీసీలలో రాజకీయంగా చైతన్యం తీసుకువచ్చిన జాజుల శ్రీనివాస్ గౌడ్ కు బీసీ సమాజం తరఫున కృతజ్ఞతలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో బీసీ సంక్షేమ సంఘం మండల అధ్యక్షుడు బొల్లపల్లి లక్ష్మణ్, యువజన సంఘం అధ్యక్షులు కొప్పు రామకృష్ణ, ఉపాధ్యక్షులు కొల్లూరి నవీన్, నియోజకవర్గ కార్యదర్శి కట్కూరు శ్రీకాంత్, నియోజవర్గ కార్యదర్శి సుర్వి శ్రీకాంత్, షరీఫ్, విడం సాయి, వెంకటేష్, లింగస్వామి, అనిల్ ,ప్రదీప్, కైసర్, ప్రకాష్, ఆకాష్, రామ కృష్ణ, యశ్వంత్, ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు.