03-11-2025 12:38:39 AM
ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ డా.సి.సువర్ణ
మహబూబ్ నగర్, నవంబర్ 2 (విజయక్రాంతి): నగర్ వనో యోజన ద్వారా 2 కోట్ల రూ.లతో మయూరి పార్క్ అభివృద్ధి ,పునరుద్ధరణ ,సుందరీకరణ పనులు చేపట్టడం జరిగిందని ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ డా.సి.సువర్ణ అన్నారు.ఆదివారం మయూరి పార్క్ లో బోటింగ్ ప్రదేశం వద్ద మొక్కను నాటిన అనంతరం సమావేశ మందిరం వద్ద నగర వన్ కింద సుమారు రూ 70 లక్షల వ్యయంతో పూర్తి చేసిన రూఫ్ టాప్ సోలార్ పవర్ ప్లాంట్,15 కిలో వాట్,11 సైకిళ్లు, పిల్లల ఆటల పరికరాలు,టైగర్ ఫోటో పాయింట్ పున రుద్ధరణ ,మరమ్మత్తు పనులు,బటర్ ఫ్లై,కరెన్సీ పార్క్ పునరుద్ధరణ,సుందరీకరణ పనులను ఆమె ప్రారంభించా రు.
నగర వన్ ద్వారా పూర్తి చేసిన,జరుగుతున్న పనులపై ఏర్పాటు చేసిన ఫోటో ఎగ్జిబిషన్ ను ఆమె తిలకించి పనుల గురించి తెలుసుకున్నారు.అనంతరం అటవీ సిబ్బంది ఆమె మాట్లాడారు. తర్వాత పిల్లల మర్రి వృక్షం ను సందర్శించారు.పిల్లల మర్రి ప్రాముఖ్యత గురించి అటవీ అధికారులు వివరించారు.
అనంతరం డీర్ పార్క్,మినీ జూ పార్క్ ను ఆమె సందర్శించి అక్కడ వివిధ పక్షులు, జంతువుల గురించి ఆసక్తిగా తిలకించారు. చివరగా శ్రీ రాజ రాజేశ్వరి ఆలయం, మ్యూజియం ను సందర్శించారు.మ్యూజియం లో సేకరించిన పురాతన విగ్రహాలు,నాణేలు,వస్తువులు, సామాగ్రి పరిశీలించారు.ఈ కార్యక్రమంలో కన్జర్వేటర్ ఆప్ ఫారెస్ట్, జోగులాంబ సర్కిల్ శివాల రాం బాబు, జిల్లా అటవీ అధికారి ఎస్. సత్యనారాయణ, ఎఫ్‌ఆర్‌ఓ ఎండి అబ్దుల్ హై తదితరులు ఉన్నారు.