03-11-2025 12:38:55 AM
ఆలేరు, నవంబర్ 2 (విజయ క్రాంతి): ఆలేరు రైల్వే గేట్ అండర్ పాస్ బ్రిడ్జీ కి ఇరువైపుల ఉన్న రోడ్డును ఇంకెపుడు బాగు చేస్తారు అని గుంతలు పడిన రోడ్డును పరిశీలిస్తూ నిరసన తెలుపుతున్న సీపీఐ (ఎం.ఎల్) న్యూడెమోక్రసీ నేతలు, పోయిన బీఆర్‌ఎస్ ప్రభుత్వ ఆయాంలోనే పూర్తి కావలసిన ఆలేరు రైల్వే గేట్ అండర్ పాస్ బ్రిడ్జి తీవ్ర నిర్లక్ష్యానికి గురైంది. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక అండర్ పాస్ బ్రిడ్జి పనులు ప్రారంభం అయి సంవత్సరం కావస్తున్నప్పటికి నేటికీ బ్రిడ్జి పూర్తి కానందున, అండర్ పాస్ బ్రిడ్జి కి ఇరువైపుల ఉన్న రోడ్డు పెద్ద పెద్ద గుంతలు పడి ఇబ్బందికరమైన పరిస్థితులు ఏర్పడడంతో ప్రజలు తీవ్ర అసౌకర్యానికి గురవుతున్నారని, అనేక ఇబ్బందులు, అవస్తలు పడుతున్నారని సీపీఐ (ఎం.ఎల్) న్యూడెమోక్రసీ జిల్లా కార్యదర్శి ఆర్.జనార్ధన్ ఆవేదన వ్యక్తం చేశారు.
ఆదివారం నాడు ఆలేరు అండర్ పాస్ బ్రిడ్జి కి ఇరువైపుల పెద్ద పెద్ద గుంతలు పడి పాడైపోయిన రోడ్డును సీపీఐ (ఎం.ఎల్) న్యూడెమోక్రసీ నేతలు పరిశీలిస్తూ నిరసన తెలిపారు. ఈ కార్యక్రమంలో అఖిల భారత రైతు కూలీ సంఘం (ఏఐకేఎంఎస్) రాష్ట్ర అద్యక్షులు మామిడాల భిక్షపతి, సీపీఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ డివిజన్ కార్యదర్శి ఇక్కిరి సహదేవ్, ఏ ఐ కే ఎం ఎస్ జిల్లా అధ్యక్షులు కల్లెపు అడివయ్య, ఐ ఎఫ్ టి యు జిల్లా అధ్యక్షులు పద్మ సుదర్శన్, టంగుటూరు మాజీ సర్పంచ్ కట్టా సమరసింహారెడ్డి, ప్రజా సంఘాల నాయకులు ఇక్కిరి శ్రీనివాస్, తమ్మడి అంజయ్య, చిరబోయిన కొమురయ్య, గడ్డం మంకయ్య, కుర్రి సత్యనారాయణ, అయిల యాకయ్య, కొమ్మిడి గోపాల్ రెడ్డి, ఇక్కిరి బీరయ్య, కల్లెపు నిషాంత్, చింతకింది సిద్దులు, కొమ్మిడి నర్సింహారెడ్డి పాల్గొన్నారు.