calender_icon.png 7 February, 2026 | 8:44 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

వేసవిలో నీటిఎద్దడి రాకుండా చర్యలు

07-02-2026 12:25:07 AM

కోదాడ (నడిగూడెం), ఫిబ్రవరి 6: వేసవి కాలంలో గ్రామాలలో నీటి ఎద్దడి రాకుండా  మండలంలోని అన్ని గ్రామాల్లో విలేజ్ వాటర్ శానిటేషన్ కమిటీలు ఏర్పాటు చేసి ముందస్తు ప్రణాళికలు చేపడుతున్నట్లు  ఆర్డబ్ల్యూఎస్ ఏఈ ఇర్ఫాన్ తెలిపారు.

శుక్రవారం మండల కేంద్రంలోని గ్రామ పంచాయతీ కార్యాలయం నందు సర్పంచ్ దున్న శ్రీనివాస్ అధ్యక్షతన  నిర్వహించిన విలేజ్ వాటర్ శానిటేషన్ కమిటీ సమావేశంలో పాల్గొని మాట్లాడుతూ బోర్ మోటార్లను ఎప్పటికప్పుడు పరిశీలించా లని, వాటర్ ట్యాంకులను శుభ్రపరచాలని తెలిపారు.

అనంతరం సర్పంచ్ దున్న శ్రీనివాస్, పాలకవర్గ సభ్యులతో కలసి మంచినీటి వాటర్ ట్యాంకును పరిశీలించారు.ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి యలక ఉమారాణి, వార్డు సభ్యులు దున్న లింగయ్య,దున్న మనీషా,కాసాని శైలజ సతీష్,గుండు మహేంద్ర ప్రసాద్,కాసాని మాధవి గోపీనాథ్, షేక్ నాజియా రియాజ్ పాల్గొన్నారు.