calender_icon.png 25 August, 2025 | 9:52 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

టీచర్‌గా మారిన మెదక్ కలెక్టర్!

25-08-2025 12:00:00 AM

సీజనల్  వ్యాధులపై అప్రమత్తంగా ఉండాలి 

మెదక్, ఆగస్టు 24 (విజయక్రాంతి): కేజీబీవీల ద్వారా నాణ్యమైన విద్య అందించడానికి చర్యలు తీసుకుంటూ, సీజనల్ వ్యాధులపై ప్రజలను ఎప్పటికప్పుడు అప్రమత్తం చేయాలని కలెక్టర్ రాహుల్ రాజ్ అధికారులను ఆదేశించారు. ఆదివారం శంకరంపేట మండలం ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. స్టాఫ్ హాజరు రిజిస్టర్, ఎ యన్ సి రిజిస్టర్ లను పరిశీలించారు.

ప్రభుత్వాసుపత్రిలోనే ప్రసవాలు అయ్యే విధంగా చూడాలని అన్నారు. సీజనల్ వ్యాధులపై అప్రమత్తంగా ఉంటూ డెంగ్యూ, మలేరియా, చికెన్ గున్యా వంటి ప్రాణాంతక వ్యాధులు ప్రజలకు సోకకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. అనంతరం కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయంలో కలెక్టర్ తరగతి గదులలో విద్యార్థినిల సామర్ధ్యాలను ప్రశ్నలు, జవాబులు రూపంలో అడిగి సంతృప్తి వ్యక్తం చేశారు.