calender_icon.png 2 August, 2025 | 7:16 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

భారత్‌కు 24 పతకాలు

28-10-2024 12:00:00 AM

జపాన్ పారా బ్యాడ్మింటన్ టోర్నీ

టోక్యో: జపాన్ పారా బ్యాడ్మింటన్ టోర్నీలో భారత షట్లర్లు సత్తా చాటారు. ఆదివారంతో ముగిసిన టోర్నీలో భారత్ 24 పతకాలతో మెరిసింది. ఇందులో ఆరు స్వర్ణాలు, 9 రజతాలు, 9 కాంస్యాలు ఉన్నాయి. పురుషుల విభాగంలో శివరాజన్ సొలైమలై డబుల్ గోల్డ్‌తో మెరిశాడు. మొదట సింగిల్స్ ఎస్‌హెచ్ 6 కేటగిరీలో స్వర్ణం నెగ్గిన శివరాజన్ ఆ తర్వాత డబుల్స్‌లో సుదర్శన్‌తో జత కట్టిన శివరాజన్ పసిడి సొంతం చేసుకున్నాడు.

ఇక సింగిల్స్ ఎస్‌ఎల్-4 కేటగిరీలో పసిడి నెగ్గిన సుకంత్ కదమ్ డబుల్స్‌లో రజతం సాధించాడు. మహిళల సింగిల్స్ విభాగంలో ఎస్‌యూ-5 కేటగిరీలో మనీశా రామ్‌దాస్ 21-12, 21-18తో జపాన్‌కు చెందిన మమికొ టొయొడాను ఓడించి స్వర్ణం నెగ్గగా.. ఎస్‌ఎల్-3 కేటగిరీలో నీరజ రజతం గెలుచుకుంది.

పురుషుల డబుల్స్ ఎస్‌యూ-5 కేటగిరీలో హార్దిక్ మక్కర్- రుత్తిక్ జంట స్వర్ణం గెలిచింది. మహిళల డబ్ల్యూహెచ్-2 సింగిల్స్ కేటగిరీలో ఆల్ఫియా జేమ్స్ రజతం నెగ్గింది.