calender_icon.png 1 August, 2025 | 2:51 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

జెంగ్‌దే పాన్ పసిఫిక్

28-10-2024 12:00:00 AM

  1. ఫైనల్లో కెనిన్‌పై విజయం 
  2. డబ్ల్యూటీఏ ఫైనల్స్‌కు చైనా స్టార్ 

టోక్యో: జపాన్ వేదికగా జరిగిన పాన్ పసిఫిక్ ఓపెన్ టెన్నిస్ టోర్నీ విజేతగా చైనా స్టార్ క్విన్ జెంగ్ నిలిచింది. ఆదివారం మహిళల సింగిల్స్ ఫైనల్లో జెంగ్ 7-6 (7/5), 6-3తో అమెరికా క్రీడాకారిణి సోఫియా కెనిన్‌ను ఓడించి చాంపియన్‌గా నిలిచింది. ఈ విజయంతో జెంగ్ వచ్చే నెలలో జరగనున్న ప్రతిష్ఠాత్మక డబ్ల్యూటీఏ ఫైనల్స్‌కు అర్హత సాధించింది.

పారిస్ ఒలిం పిక్స్‌లో స్వర్ణంతో చరిత్ర సృష్టించిన జెంగ్ పాన్ పసిఫిక్ ఓపెన్ ఫైనల్లో కెనిన్‌పై పూర్తి ఆధిపత్యం ప్రదర్శించింది. తొలి సెట్‌ను టై బ్రేక్‌లో సొంతం చేసుకున్న జెంగ్.. రెండో సెట్‌ను మాత్రం పెద్దగా కష్టపడకుండానే దక్కించుకుంది.

దాదాపు రెండు గంటల పాటు సాగిన పోరులో 16 ఏస్‌లు సంధించిన జెంగ్ ఒకే ఒక్క బ్రేక్ పాయింట్ సాధించింది. ఈ ఏడాది జెంగ్‌కు ఇది మూడో టైటిల్ కాగా.. హార్డ్ కోర్టులో ఇదే తొలి టైటిల్. ఇక డబ్ల్యూటీఏ ఫైనల్స్ నవంబర్ 2 నుంచి జరగనుంది.