28-10-2024 12:00:00 AM
పీకేఎల్ 11వ సీజన్
హైదరాబాద్: ప్రొ కబడ్డీ లీగ్ (పీకేఎల్) సీజన్ 11లో మ్యాచ్‌లు ఉత్కంఠభరితంగా సాగుతున్నాయి. ఆదివారం గచ్చిబౌలి వేదికగా జైపూర్ పింక్ పాంథర్స్, తమిళ్ తలై వాస్ మధ్య జరిగిన తొలి మ్యాచ్ 30-30 తో టైగా ముగిసింది. ఈ సీజన్‌లో ఇది రెండో టై కావడం గమనార్హం. జైపూర్ తరఫున రైడర్ అర్జున్ దేశ్వాల్ 7 పాయింట్లు, రైడర్ వికాశ్ ఆరు పాయింట్లు సాధించగా.. తమిళ్ తలైవాస్ తరఫున రైడర్ సచిన్ 11 పాయింట్లతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు.
ఇక రెండో మ్యాచ్‌లో యూపీ యోద్ధాస్, గుజరాత్ జెయింట్స్ తలపడ్డాయి. ఆద్యంతం థ్రిల్లింగ్‌గా సాగిన పోరులో యూపీ యోద్ధా స్ 32-29 తేడాతో గుజరాత్‌పై విజయం సాధించింది. యూపీ తరఫున భవానీ రాజ్‌పుత్ 9 పాయింట్లు, ఆల్‌రౌండర్ భరత్ 10 టాకిల్ పాయింట్లు స్కోరు చేయగా.. గుజరాత్ తరఫున రైడర్ రాకేశ్ 8 పాయింట్లతో రాణించాడు. నేడు జరగనున్న మ్యాచ్‌ల్లో హర్యానాతో దబంగ్ ఢిల్లీ, తెలుగు టైటాన్స్‌తో పట్నా పైరేట్స్ తలపడనున్నాయి.