calender_icon.png 10 December, 2025 | 1:10 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మేడారం జాతర సమీక్ష సమావేశం

09-12-2025 08:17:49 PM

వరంగల్ రీజనల్ మేనేజర్ దర్శనం విజయభాను

హనుమకొండ టౌన్ (విజయక్రాంతి): వరంగల్ రీజియన్ పరిధిలోని అన్ని డిపోల మెకానికల్ సూపర్వైజర్, ఎస్డిఐ, సేఫ్టీ వార్డెన్, స్టోర్ సూపర్వైజర్ లతో వరంగల్ రీజియన్ మేనేజర్ దర్శనం విజయభాను 2026 సంవత్సరం మేడారం జాతరకు చేయవలసిన ఏర్పాట్లను, నడపవలసిన బస్సులను, సిబ్బందికి, ప్రయాణికులకు ఏర్పాటు చేయవలసిన సౌకర్యాల గురించి సమీక్ష సమావేశం నిర్వహించారు. అనంతరం దర్శనం విజయభాను మాట్లాడుతూ డిపోల వారీగా ఆపరేషన్లకు సంబంధించి పలు సూచనలు చేయడం జరిగింది. మేడారం జాతర-2026  జనవరి 25 నుండి ఫిబ్రవరి 1 వ తేదీ వరకు జాతర జరగనుందని తెలిపారు.

జాతరకోసం వచ్చే భక్తుల సౌకర్యార్థం, గత జాతర సందర్భంగా నడిపిన బస్సులు ప్రయాణికుల కొరకు చేసిన ఏర్పాట్లను, ఈ జాతరలో నడపవలసిన బస్సులకు సంబంధించిన ఏర్పాట్లు సిబ్బందికి, ప్రయాణికుల సౌకర్యాల గురించి సమావేశంలో చర్చించడం జరిగింది. జాతరకు నడపవలసిన అన్ని బస్సులను ముందుగానే  తనిఖీచేసి, తగిన మరమ్మత్తులు చేసి జాతరకు సిద్ధంగా ఉంచాలని సూచించడం జరిగింది. జాతర సమయంలో ఎలాంటి బస్సు రిపేర్లు, ఫెయిల్యూర్లు రాకుండా చూసుకోవాలని సూచించడం జరిగింది. ఎస్ డి ఐ లు, సేఫ్టీ వార్డెన్లు ఉద్దేశించి ఈ జాతర సందర్భంగా వారికి కేటాయించే మేడారం డ్యూటీల గురించి వివరించడం జరిగింది.జాతర కోసం నడిపే బస్సులకు ఎలాంటి రిపేర్లు ఉండకుండా ముందు జాగ్రత్తగా చూసుకోవాలని అన్నారు.

అలాగే మేడారం జాతర కోసం డ్యూటీలో ఉండే డ్రైవర్లు ఆరోగ్య పరిస్థితిలో ఇతిగతులను ఎప్పటికప్పుడు అమీక్షించుకోవాలని తెలిపారు. గత జాతరలో ట్రాఫిక్ జామ్ వలన ప్రయాణికులకు తీవ అసౌకర్యం కలిగింది. ఈ ట్రాఫిక్ కారణంగా ప్రైవేటు వాహనాల నిర్లక్ష్యపరితమైన డ్రైవింగ్ వల్ల మహిళలు, చిన్నపిల్లలు తీవ్ర ఇబ్బందులకు అయినారని అన్నారు. మేడారం అమ్మవార్లను దర్శించుకోవడానికి వచ్చే భక్తులందరూ ఆర్టీసీ బస్సులోనే ప్రయాణించాలని కోరడం జరిగింది. ఆర్టీసీ బస్సుల్లో మహాలక్ష్మి ఉచిత ప్రయాణం పథకం వర్తిస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో వరంగల్ డిప్యూటీ జనరల్ మేనేజర్ పి. మహేష్, డిప్యూటీ రీజినల్ మేనేజర్ కేశరాజు భాను కిరణ్, అకౌంట్ ఆఫీసర్ ఏ. రవీందర్, అన్ని డిపో మెకానిక్ సూపర్వైజర్, ఎస్బిఐ, సేఫ్టీ వార్డెన్, స్టోర్స్ సూపర్వైజర్ లు పాల్గొనడం జరిగింది.