14 July, 2026 | 6:28 PM

Breaking News

తెలంగాణను మళ్లీ ఎడారిగా మార్చే కుట్ర జరుగుతోంది   •   భద్రతా చర్యలపై బ్యాంక్ మేనేజర్లకు అవగాహన కల్పించిన సీఐ రంజిత్ రావు   •   మండలాధ్యక్షునిపై అసంతృప్తి రాగాలు   •   చిట్యాల–భువనగిరి రహదారి విస్తరణపై స్పష్టత ఇవ్వాలని బీఆర్ఎస్ వినతి   •   విద్యార్థి దశ నుంచే ప్రజాస్వామ్య వ్యవస్థపై అవగాహన కల్గి ఉండాలి   •   సింగరేణి హెడ్ఆఫీస్ ముందు జరిగే ధర్నాను జయప్రదం చేయండి: ఐఎఫ్టియు   •   జగన్నాథ రథయాత్ర జిల్లా కలెక్టర్ కు ఆహ్వానం   •   అనారోగ్యంతో చికిత్స పొందుతున్న ఎంపీపీని పరామర్శించిన మాజీ సర్పంచ్   •   రైతులు ఆరుతడి పంటలను సాగు చేయాలి   •   వ్యవసాయ అధికారుల క్షేత్రస్థాయి పరిశీలన   •  

మేడారం మహా జాతర పోస్టర్ ఆవిష్కరణ

28-01-2026 12:00 AM

జగిత్యాల, జనవరి 27 (విజయ క్రాంతి): జిల్లా గిరిజన సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో రూ పొందించిన మేడారం మహా జాతర పోస్టర్ మంగళవారం కలెక్టరేట్ లో జిల్లా కలెక్టర్ బి సత్యప్రసాద్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సమ్మక్క, సార లమ్మ వన దేవతల మేడారం మహా జాతర ఈనెల 28 నుండి 31 వరకు జరగనున్న నేపథ్యంలో దర్శనాలకు వచ్చే ప్రజలకు అన్ని సౌ కర్యాలు కల్పించినట్లు తెలిపారు. జిల్లా నుం డి ఆర్.టి.సి బస్ లు అందుబాటులో ఉంటాయని తెలిపారు. వన దేవతల దర్శనాలకు వెళ్లే భక్తులు జాగ్రత్తగా వెళ్లి భక్తి శ్రద్ధలతో దేవతల కృప పొందాలని కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్సీ, ఎస్టీ సంక్షేమ శాఖ అధికారి కె. రాజ్ కుమార్, తదితరులు పాల్గొన్నారు.