10-10-2025 12:07:30 AM
-అభ్యర్థుల ఎంపికలో అన్ని పార్టీలో తర్జనభర్జన
-సెట్టింగ్ ఎమ్మెల్యేలకు ఎంపిక బాధ్యత
-ఎంపిక కాని అభ్యర్థులు.. అయోమయంలో నేతలు
నిర్మల్, అక్టోబర్ 9 (విజయక్రాంతి): స్థాని క సంస్థల ఎన్నికలు పార్టీ లీడర్లకు ప్రతిష్టాత్మకంగా మారనున్నాయి. రాష్ట్రంలో ప్రజా పాలన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రెండేళ్లకు ఎన్నికలను నిర్వహిస్తున్నారు. ఎన్నికలను అధికార కాంగ్రెస్ పార్టీతో పాటు టిఆర్‌ఎస్ బిజెపి పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకొని జెడ్పిటిసి ఎంపిటిసి ఎన్నిక ల్లో గెలుపు గుర్రాల అభ్యర్థులపై తీవ్ర అన్వేషణ వడపోత కార్యక్రమాన్ని నిర్వహిస్తు న్నారు. ప్రభుత్వం బీసీలకు 42 శాతం రిజర్వేషన్ కల్పిస్తూ స్థానిక సంస్థల ఎన్నికల్లో రిజర్వేషన్ల ప్రక్రియ పూర్తి చేసిన నేపథ్యంలో నిర్మల్ జిల్లాలో ఈసారి ఎన్నికలు బీసీలకు అత్యధిక సీట్లు దక్కనున్నాయి.
జిల్లాలో మొత్తం 18 జెడ్పిటిసి స్థానాలు 18 ఎంపీపీ స్థానాలు 1057 ఎంపీటీ స్థానాలు ఉండగా ఈసారి బీసీలకు ఎంపీపీ స్థానాలు 8 స్థానా లు చక్కగా ఎంపీటీసీల్లో 67 స్థానాలను బీసీలకు కేటాయించారు. ఎంపీపీ జడ్పిటిసి ఎంపీపీ స్థానాల్లో 18 స్థానాలకు గాను జనరల్ కు నాలుగు బీసీలకు 8 ఎస్‌టిలకు రెం డు ఎస్సీలకు రెండు కేటాయించారు గ్రామపంచాయతీలో 400 గాను 150 మందికి బీసీలకు రిజర్వేషన్ కల్పించారు. రిజర్వేషన్ల ప్రక్రియ పూర్తి కావడంతో ఆయా మండలాల్లో జడ్పిటిసి ఎంపిటిసి సర్పస్థానాల్లో కాంగ్రెస్ బిజెపి టిఆర్‌ఎస్ పార్టీ మద్దతు ధరలను గెలిపించుకునేందుకు జిల్లాలోని రాజకీ యపరకుబడి ఉన్న నేతలకు ప్రతిష్టాత్మకంగా కానున్నాయి
లీడర్లకు ప్రతిష్టాత్మకం
నిర్మల్ జిల్లాలో జరుగుతున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ అభ్యర్థుల గెలుపు లీడర్లకు ప్రతిష్టాత్మక కా నుంది. కాంగ్రెస్ పార్టీ అధికారులకు వచ్చిన తర్వాత మొట్టమొదటిసారిగా ఎన్నికలను నిర్వ హిస్తున్న నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ నిర్మ ల్ ఖానాపూర ముధోల్ నియోజకవర్గం లో బలమైన అభ్యర్థులను నిలబెట్టేందుకు కసరత్తు చేస్తున్నారు.
జిల్లాలో మూడు నియోజకవర్గాలు ఉండగా ఖానాపూర్‌లో అధికార పార్టీ ఎమ్మె ల్యే వెడమ బొజ్జు పటేల్ నిర్మల్ ముధోళ్ లో బిజెపి ఎమ్మెల్యేలు మహేశ్వర్ రెడ్డి రామారావు పటేల్ ప్రాతినిథ్యం వహిస్తున్నారు. సెట్టింగ్ ఎమ్మెల్యేలు తన నియోజకవర్గ పరిధిలోని ఎంపీటీసీ జెడ్పిటిసి స్థానాలను కైవసం చేసుకుంటేనే తమ రాజకీయ ఉనికి ఉంటుందని భావి స్తూ తన మద్దతుదారులు రిజర్వేషన్ల ప్రకారం అభ్యర్థుల ఎంపికపై వడపోత కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఈసారి జెడ్ పీఠాన్ని బీసీలకు కేటాయించడంతో బీసీలు బలమైన నాయకున్ని జడ్పిటిసిగా పోటీ చేసి గెలిపించే బాధ్యతను చేపట్టారు.
కాంగ్రెస్ పార్టీ లో నిర్మల్ లో మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి డిసిసి అధ్యక్షులు శ్రీహరి రావు స్థానిక సంస్థ ల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపించుకునే విధంగా బాధితులను స్వీకరించారు. ముధోళ్‌లో మాజీ ఎమ్మెల్యేలు విట్టల్ రెడ్డి నారాయణరావు పటేల్ కాంగ్రెస్ అభ్యర్థుల ఎంపిక బాధ్యతలు చేపట్టారు. టిఆర్‌ఎస్ తరఫున నిర్మల్‌లో సమన్వయ కన్వీనర్ కే రామకృష్ణారెడ్డి సీనియర్ నేతలు డాక్టర్ సుభాష్ రావు మార్కొండ రాము టిఆర్‌ఎస్ అభ్యర్థుల ఎంపికపై కసరత్తుచేస్తున్నారు. ముధోళ్‌లో ఆ పార్టీ సీనియ ర్ నాయకులు మాజీ జడ్పీ చైర్మన్ శ్యాంసుందర్ కిరణ్ కారి పడకంటి రమాదేవి గాదె విలాస్ ఖానాపూర్లో పార్టీ నియోజకవర్గ ఇన్చార్జి ఝాన్సీ నాయక్ అభ్యర్థుల ఎంపికపై తరజన భర్జన పడుతున్నారు.
ఖానాపూర్లో బిజెపి తరఫున ఆ పార్టీ జిల్లా అధ్యక్షులు రితేష్ రాథోడ్ కష్టప డుతున్నారు ఇప్పటికి మండలాల వారిగా కార్యకర్తల సమావేశాలు నిర్వహించి ఆయా గ్రామా ల్లో ప్రాంతాల్లో ప్రజాబలం ఉన్న నేతల పేర్లను గుర్తించి వీరిలో బలమైన వారు ఎవరని ప్రజాభిప్రాయ సేకరణ తర్వాత పార్టీ అభ్యర్థులుగా ప్రకటించి బి ఫారాలను అందజేస్తారు. ఈ ఎన్నికలు రాజకీయ పార్టీల ముఖ్య నేతలకు ప్రతిష్టాత్మకంగా కానున్న నేపథ్యంలో గెలుపు ఓటములు వారి రాజకీయ భవిష్యత్తుపై ఆధారపడి ఉండే అవకాశం ఉన్నందున అభ్యర్థుల ఎంపిక విషయంలో ఆచితూచి అడుగు వేస్తున్నారు
అందరి గురి జడ్పీ చైర్మన్ పైనే...
స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో ఈసారి బీసీ వర్గానికి మెజార్టీ పదవులు రావడంతో అన్ని మండలాల్లో పోటీ చేసే అభ్యర్థులు జెడ్పీ చైర్మన్ పదవిపై గురి పెట్టారు. అధికార కాంగ్రెస్ పార్టీతో పాటు బిజెపి బిఆర్‌ఎస్ లో జడ్పీ చైర్మన్ వైస్ చైర్మన్ పదవులు పొందేందుకు తప్పనిసరిగా జడ్పిటిసి ఎన్నికల బరిలో నిలవాలని ఆ ఛాన్స్ మిస్ అయితే ఎంపీటీసీగా గెలిచి ఎంపీపీ పదవి చేజిక్కుకోవాలని తీవ్ర ప్రయత్నాలు సాగిస్తున్నారు.
జడ్పిస్తా నం బీసీ జనరల్ కు కేటాయించడంతో నిర్మల్ యోగ నుంచి బిజెపిలో ముగ్గు రు కాంగ్రెస్లో ఇద్దరూ బిఆర్‌ఎస్‌లో ఇద్దరు పోటీ పడుతుండగా మొదలు నియోజక వర్గం నుంచి కాంగ్రెస్లో ముగ్గురు బిజెపి లో ముగ్గురు టిఆర్‌ఎస్ లో ఇద్దరు ఖానాపూ ర్ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్లో ఒకరు బిజెపిలో ఒకరు టిఆర్‌ఎస్ లో ఒకరు జెడ్పి చైర్మన్ పై గురుపెట్టి జెడ్పిటిసి సీటు కోసం తీవ్ర ప్రయత్నాలు సాగిస్తున్నారు.
ఇప్పటికీ ముఖ్య నాయకులంతా తనకు చైర్మన్ పదవి కావాలని ముఖ్య నాయకుల వద్ద మొరపెట్టుకుంటున్నారు. కొందరు జడ్పీ చైర్మన్ పదవి ఇస్తేనే జెడ్పిటిసి ఎన్నికల్లో పోటీ చేస్తామని మొండికేస్తున్నారు. పార్టీ ముఖ్య నేతల సైతం ఎవరికి హామీ ఇవ్వకుండా పార్టీ అధిష్టానం ఎవరికి టికెట్లు ఇచ్చి న అందరూ కలిసి సమిష్టిగా పార్టీ అభ్యర్థి గెలుపు కోసం కష్టపడి పని చేయాలని సూచిస్తున్నారు. జడ్పీ చైర్మన్ పదవి విషయంలో జెడ్పిటిసి ఎన్నికలు పూర్తి అయిన తర్వాత అందరి అభిప్రాయం మేరకు ఎంపిక జరుగుతుందని పార్టీ నేతలు ఎక్కడా నోరు జరవద్ద ని హుకుం జారీ చేశారు.
అయితే కొందరు నేతలు తాము ఉన్న పార్టీలో టికెట్ రాకపోతే వేరే పార్టీలో చేరి జెడ్పిటిసి పోటీ చేసేందుకు ఇప్పటికీ మంతనాలు చేస్తున్నారు. ఎంపీపీపై కన్నువేసిన కొందరు నేతలు ఆయా ఎంపిటి సి స్థానాల్లో బలమైన అభ్యర్థులను రంగంలో దించేందుకు ప్రత్యేక కార్యచరణ రూపొందించుకుం టున్నారు. ఆ తర్వాత జరిగే గ్రామ పంచాయతీ ఎన్నికల్లో పార్టీ గుర్తులతో ఎన్నికలు నిర్వహించి అవకాశాలు లేకపోవడంతో గ్రామపంచాయతీ ఎన్నికల్లో అభ్యర్థుల ఎంపికపై పార్టీ కార్యకర్తల అభిప్రాయానికి వదిలేస్తున్నారు
అన్ని పార్టీలు విభేదాలు
స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్ జారీ అయ్యి నామినేషన్ల ఘట్టం ప్రారంభమైన అభ్యర్థుల ఎంపిక విషయంలో అన్ని పార్టీల్లో గందరగోళం నెలకొంది. జిల్లాలోని 18 మండలాల్లో అధికార పార్టీ కాంగ్రెస్ తో పాటు బిజెపి టీఆర్‌ఎస్ లో పార్టీ నేతల మధ్య ఐక్యత లేకపోవడంతో గ్రూపు విభేదాలు అభ్యర్థుల ఎంపికపై తీవ్ర ప్రభావాన్ని చూపుతున్నాయి. జిల్లా కేంద్రంలో ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి బిజెపికి ప్రాతినిధ్య వేసినప్పటికీ సీనియర్ నేతలు ఆయన వైఖరిని నిరసిస్తూ పార్టీ అభ్యర్థుల ఎంపిక విషయంలో తాము సూచించిన పేర్లను ఎంపిక చేయాలని పట్టుబడుతున్నారు.
కాంగ్రెస్లో మాజీ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి డిసిసి అధ్యక్షులు శ్రీ ఆర్ రావు రెండు గ్రూపులుగా ఉండడంతో తమ మద్దతు దారులకు టికెట్లు ఇచ్చుకునే విధంగా అధిష్టానం పై ఒత్తిడి తెస్తున్నారు. ముధోల్ బిజెపిలో ఎమ్మెల్యే రామారావు పటేల్ ఆయన సోదరుడు మోహన్రావు పటేల్ బిజెపి సీనియర్ నాయకులు రవికుమార్ పాండే సీట్ల కోసం ఎవరికి వారే ప్రయత్నాలు చేస్తున్నారు. ఖానాపూర్ లో కొంత పోటీ తగ్గి లేదు.
కాంగ్రెస్ పార్టీలో ముధోల్ లో నారాయణరావు పటేల్ విట్టల్ రెడ్డిలు తమ వర్గీయులు ప్రాథమిక వహించేలా చర్చలు జరుపుతున్నారు. టిఆర్‌ఎస్ లో లోలం శ్యామ్ సుందర్ కిరణ్ కారే రమాదేవి అభ్యర్థుల ఎంపికపై కసరత్తు చేస్తున్నారు. అయితే అన్ని రాజకీయ పార్టీలో వర్గ విభేదాలు ఉండడంతో పార్టీ అభ్యర్థుల ఎంపిక పై తర్జనభజన పడుతూ బలమైన అభ్యర్థులను రంగంలో దించేందుకు ముఖ్య నాయకులు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు