8 July, 2026 | 8:04 PM

Breaking News

నగరంలోని పలు డివిజన్లలో అభివృద్ధి పనులకు శంకుస్థాపన   •   ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడమే లక్ష్యం   •   కాంగ్రెస్ పార్టీ జిల్లా ఎస్సీ విభాగం పాల్వంచ టౌన్ అధ్యక్షుడిగా గోలి సదాశివ   •   అగ్నివీర్ ఇండియన్ నేవిలో ఉద్యోగం సాధించిన వ్యక్తికి సన్మానం   •   తెలంగాణ చౌక్ లో ఆల్ఫోర్స్ నరేందర్ రెడ్డి జన్మదిన వేడుకలు   •   తుంగతుర్తి లైన్స్ క్లబ్ చేస్తున్న సేవలు మరువలేనివి   •   కరీంనగర్ డీసీసీ కార్యాలయంలో ఘనంగా వైఎస్ఆర్ జయంతి వేడుకలు   •   ఉపాధ్యాయులకు శిక్షణ ప్రారంభం   •   ప్రియదర్శిని మహిళా ఇంజనీరింగ్ కళాశాలలో ఐబీఎం స్కిల్స్‌బిల్డ్–టాస్క్ శిక్షణ ముగింపు   •   బాన్సువాడలోని ఆదిత్య స్కూల్ పై మున్సిపల్ కమిషనర్ కు ఫిర్యాదు   •  

పేదవర్గాలకు వైద్యశిబిరం అభినందనీయం

11-08-2025 12:00 AM

మారుమూలపల్లెలకు కార్పొరేట్ వైద్యాన్ని చేరువచేయాలి

కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు

కెసిఓఏ క్లబ్బులో కేర్ ఆస్పత్రుల వైద్యశిబిరాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే

భద్రాద్రికొత్తగూడెం , ఆగస్టు 10 (విజయ క్రాంతి):ఏజెన్సీ గ్రామాలకు కేంద్రమైన కొత్తగూడెం పట్టణంలో కేర్ ఆస్పత్రుల యాజమాన్యం ఉచిత వైద్య శిభిరాన్ని ఏర్పాటు చేసి గ్రామీణ ప్రజల కు, పేదవర్గాలకు వైద్యాన్ని అందించేందుకు ముందుకురావడం అభినందనీయమని, ఆర్ధిక స్తో మత లేని ప్రతి ఒక్కరు వివిధ సంస్థలు ఏర్పాటు చేస్తున్న వైద్య శిబిరాలను సద్వినియోగం చేసుకోవాలని కొత్తగూడెం శాసనసభ సభ్యులు కూనంనేని సాంబశివరావు కోరారు.

కేర్ ఆస్పత్రుల యాజమాన్యం పట్టణంలోని కెసిఓఏ క్లబ్బులో ఆదివారం ఏర్పాటు చేసిన వైద్య శిబిరాన్ని ప్రారంభించి మాట్లాడారు. ప్రభుత్వ వైద్యశాలల్లో సరైన వైద్యం అందక, ప్రైవేటు ఆస్పత్రులను ఆశ్ర యించే స్తోమత లేక అనారోగ్యంతో తమ జీవితాలను గడుపుతున్నారని, కొందరు ప్రాణాలు వ దులుతున్నారని, ఈ పరిస్థితిలో కార్పొరేట్, ప్రైవేటు ఆస్పత్రుల యాజమాన్యాలు, వైద్యులు మా నవీయకోణంలో పేదలకు వైద్యం అందించేందుకు ముందుకు రావాలన్నారు.

వైద్యాన్ని వ్యాపార కోణంలో మలుచుకునే విధానానికి స్వస్తిపలకాలని సూచించారు. కేర్ ఆస్పత్రుల యాజమాన్యం ఆ దిశగా అడుగులు వేయడం అభినందనీయమని, ఈసిజి, టూడీ ఏకో, జిఆర్బిఎస్, లిపిడ్ ప్రొ ఫైల్ తదితర విలువైన సేవలను ఉచితంగా అందించేందుకు ముందుకురావడాన్ని స్వాగతిస్తున్నామని, భవిషత్తులో మరిన్ని సేవలు అందించాలని సూచించారు. కార్యక్రమంలో సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్ కె సాబీర్ పాషా తదితరులు పాల్గొన్నారు.