calender_icon.png 11 August, 2025 | 5:31 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మాజీ సర్పంచ్‌ను పరామర్శించిన ఎమ్మెల్యే పాయం

11-08-2025 12:00:00 AM

బూర్గంపాడు,ఆగస్టు10,(విజయక్రాంతి):బూర్గంపాడు మండలం సోంపల్లి పంచాయతీ బుడ్డగూడెం గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్ తాటి వీరాంజనేయులు కుమార్తె తాటి అఖిల ఇటీవల అకాల మరణం చెందటంతో ఆదివారం పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు ఆయన కుటుంబాన్ని పరామర్శించారు.

అఖిల మృతికి సంతాపం వ్యక్తం చేసి కుటుంబానికి ప్రగాఢ సాను భూతిని తెలిపారు. వీరాంజనేయులు కుటుంబానికి కొండంత అండగా ఉంటానని ఎమ్మెల్యే భ రోసానిచ్చారు. ఆయన వెంట మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు దుగ్గెంపూడి కృష్ణారెడ్డి, జిల్లా మైనార్టీ సంఘం అధ్యక్షుడు మహముద్ ఖాన్,మాజీ సొసైటీ చైర్మన్ పోతిరెడ్డి వెంకటేష్ రెడ్డి, బంజర్ మాజీ ఉప సర్పంచ్ కైపు లక్ష్మీనారాయణ రెడ్డి, పార్టీ నాయకులు,్ర పెద్దలు ఉన్నారు.