calender_icon.png 26 August, 2025 | 9:15 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రైతుల గోడు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు పట్టదా..?

26-08-2025 06:56:45 PM

సిపిఐఎం జిల్లా కార్యదర్శి తుమ్మల వీరారెడ్డి

నల్గొండ టౌన్,(విజయక్రాంతి): రైతాంగం పంట పొలాలను కాపాడుకోవడం కోసం యూరియా సకాలంలో అందించండి అని రోడ్డెక్కి ఆందోళన చేస్తుంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు యూరియా కష్టాలు రైతుల గోడు పట్టవా అని సిపిఐఎం జిల్లా కార్యదర్శి తుమ్మల వీరారెడ్డి ధ్వజమెత్తారు. రైతులకు సకాలంలో యూరియాను సరఫరా చేయాలని  డిమాండ్ చేస్తూ మంగళవారం సిపిఐఎం కార్యాలయం నుంచి జిల్లా వ్యవసాయ అధికారి కార్యాలయం వరకు సిపిఐఎం పార్టీ శ్రేణులు ప్రదర్శన నిర్వహించారు. సకాలంలో రైతులకు యూరియా అందించాలని బ్లాక్ మార్కెట్ కు తరలించకుండా అధికారులు పర్యవేక్షించాలని నినాదాలు చేశారు అనంతరం జిల్లా వ్యవసాయ అధికారి కార్యాలయం ఎదుట రైతులతో కలిసి ధర్నా నిర్వహించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... రైతులు పదేపదే ప్రభుత్వానికి అధికారులకు సకాలంలో యూరియాను అందించండి పంటల్ని రక్షించాలని రైతులు రోడ్డెక్కి ఆందోళన చేస్తున్న అధికారుల, ప్రభుత్వా  స్పందన లేకపోవడంతోనే సిపిఐఎం ఆధ్వర్యంలో ధర్నా కార్యక్రమం చేపట్టినట్లు చెప్పారు. తెలంగాణ రాష్ట్రంలో రైతులకు అందించాల్సిన యూరియా కొరతను సృష్టించడానికి ఎవరు కారకులో అందరికీ తెలిసిన విషయమే అయినప్పటికీ పర్యవేక్షించాల్సిన రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోకపోవడమే ఈ పరిస్థితికి దాపరిచిందని ఆందోళన వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి తొమ్మిది వేల లక్షల మెట్రిక్ టన్నుల యూరియాను సరఫరా చేయాల్సి ఉండగా నామమాత్రంగానే రాష్ట్రానికి కేటాయింపు చేశారు.

నల్లగొండ జిల్లాకు 70 వేల మెట్రిక్ టన్నుల యూరియా అవసరముందని జిల్లా వ్యవసాయ అధికారులు గుర్తిస్తే ఇప్పటివరకు కేవలం 49 వేల మెట్రిక్ టన్నుల యూరియా మాత్రమే సరఫరా జరిగిందని ఆవేదన వ్యక్తం చేశారు. రాత్రి పగలు అని తేడా లేకుండా సహకార సంఘాల ఎదుట వ్యవసాయ కార్యాలయం ,షాపుల దగ్గర రైతులు పడిగాపులు కాస్తున్న పరిస్థితులు ఏర్పడ్డాయని పేర్కొన్నారు. జిల్లాలో యూరియా కొడతలేదని జిల్లా కలెక్టర్ పదేపదే పరకటనలు చేస్తున్నప్పటికీ రైతాంగం రోడ్డెక్కి ఆందోళన చేస్తుంటే సమాధానం చెప్పాల్సిన బాధ్యత అధికారుల పైన ఉందని చెప్పారు.