calender_icon.png 11 February, 2026 | 9:24 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మహిళ ప్రాణాలు కాపాడిన ‘మెడికవర్’

11-02-2026 02:13:04 AM

హైదరాబాద్, ఫిబ్రవరి 10 (విజయక్రాంతి): రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి, ప్రాణాపాయ స్థితికి 58 ఏళ్ల మహిళకు మెడికవర్ హాస్పిటల్స్, చందానగర్‌లోని వైద్యులు సమయానికి చికిత్స అందించి ప్రాణాలను కాపాడారు. ప్రమాదంలో ఆమెకు ఛాతీకి తీవ్రమైన దెబ్బ తగిలి పక్క ఎముకలు విరగడం, ఊపిరితిత్తులకు గాయం, పొట్టలోని ప్లీహం (స్ప్లీన్) చీలిపోవడం, నడుము భాగంలోని ఎముకలు అలాగే కుడి తొడ, కాలి ఎముకలు తీవ్రంగా విరగడం వంటి అనేక ప్రమాదకర గాయాలు అయ్యాయి.

ప్రమాదం జరిగిన వెంటనే ఆమెను అత్యవసర స్థితిలో మెడికవర్ హాస్పిటల్స్‌కు తరలించారు. ఐసీయూలో చేర్చి చికిత్స ప్రారంభించారు. పొట్టలో తీవ్రమైన అంతర్గత రక్తస్రావం జరుగుతున్నట్లు గుర్తించిన వైద్యులు ప్రాణాలను కాపాడేందుకు అత్యవసరంగా శస్త్రచికిత్స నిర్వహించారు. ఈ శస్త్రచికిత్సను డా. బర్జీ సాయి దిలీప్, కన్సల్టెంట్ జనరల్, లేజర్, లాపరాస్కోపిక్ సర్జన్ విజయవంతంగా నిర్వహించగా, అనస్థీషియా, నొప్పి నియంత్రణ బాధ్యతలను డా. శ్వేత రాపోలు, కన్సల్టెంట్ అనస్థీషియాలజిస్ట్, ఇంటర్వెన్షనల్ పెయిన్ ఫిజీషియన్ సమర్థవంతంగా నిర్వహించారు.

విరిగిన కుడి తొడ, కాలి ఎముకలకు ఆధునిక శస్త్రచికిత్సల ద్వారా రాడ్లు, ప్లేట్లు అమర్చారు. చికిత్స మొత్తం సమయంలో ఐసీయూలో రోగిణిని నిరంతరం పర్యవేక్షిస్తూ డా. రాజు సికిలమ్మెట్ల, కన్సల్టెంట్ ఇంటెన్సివిస్ట్ ఆధ్వర్యంలో క్రిటికల్ కేర్ బృందం కీలక సేవలు అందించింది. పూర్తిగా స్థిరమైన ఆరోగ్యంతో ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ఈ విషయాన్ని డా. ముడవత్ శశి వర్ధన్, కన్సల్టెంట్ ట్రామా, జాయింట్ రీప్లేస్మెంట్ సర్జన్, మెడికవర్ హాస్పిటల్స్  చందానగర్ తెలిపారు.