calender_icon.png 14 July, 2025 | 6:09 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

12న ఉద్యోగుల జేఏసీతో భేటీ

08-04-2025 01:03:10 AM

  1. సమస్యలపై క్యాబినెట్ సబ్‌కమిటీ చర్చ
  2. హామీ ఇచ్చిన డిప్యూటీ సీఎం భట్టి

హైరదాబాద్, ఏప్రిల్ 7 (విజయక్రాంతి): ఈ నెల 12న ఉద్యోగుల జేఏసీతో రాష్ట్ర క్యాబినెట్ సబ్ కమిటీ సమావేశం కానుంది. ఈ మేరకు దీర్ఘకాలికంగా పెండింగ్‌లో ఉన్న సమస్యలపై చర్చించనుంది. ఈ మేరకు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కను తెలంగాణ ఉద్యోగుల జేఏసీ చైర్మన్ మారం జగదీశ్వర్, సెక్రటరీ జనరల్ ఏలూరి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో జేఏసీ నేతలు సోమవారం కలిశారు.

రాష్ర్ట ఉద్యోగులు దీర్ఘకాలంగా ఎదుర్కొంటున్న 57 సమస్యలను పరిష్కరించాలని, ఇందుకు క్యాబినెట్ సబ్‌కమిటీ సమావేశం నిర్వహించాలని కోరారు. సానుకూలంగా స్పందించిన డిప్యూటీ సీఎం ఈ నెల 12న  సమావేశం నిర్వహించనున్నట్లు వారికి హామీ ఇచ్చినట్లు తెలిపారు.