14-07-2025 05:52:36 PM
జిల్లా పంచాయతీ అధికారికి ఆదేశాలు జారీ చేసిన కలెక్టర్
నిర్లక్ష్యం చేయవద్దని ఆదేశం
ప్రజావాణిలో కలెక్టర్ ను కలిసి విన్నవించిన గ్రామస్తులు
విజయక్రాంతి కథనానికి స్పందన
కామారెడ్డి (విజయక్రాంతి): పురుగులు... బాబోయ్... పురుగులు... ఇలా అయితే ఊరు వదిలేయాలా అనే శీర్షికతో విజయక్రాంతి దినపత్రికలో సోమవారం ప్రచురీతమైన కథనానికి జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగువాన్(District Collector Ashish Sangwan) స్పందించారు. కామారెడ్డి జిల్లా సదాశివనగర్ మండలం అడ్లూరు ఎల్లారెడ్డి గ్రామస్తులు ప్రజావాణి కార్యక్రమానికి వచ్చి గ్రామంలో ఎంఎల్ఎస్ గోదాం నుంచి పురుగులు వచ్చి ఇండ్లలో, మనుషులపై వాలుతున్నాయని వెంటనే వాటిని నియంత్రించాలని గ్రామస్తులు ప్రజావాణిలో సోమవారం ఫిర్యాదు చేశారు. విజయక్రాంతి దినపత్రికలో వచ్చిన కథనాన్ని కలెక్టర్కు గ్రామస్తులు చూపించారు. వెంటనే స్పందించిన కలెక్టర్ జిల్లా పంచాయతీ అధికారి మురళిని చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేశారు. పురుగుల నివారణకు చర్యలు వెంటనే చేపట్టాలని ఆదేశించారు. జిల్లా కలెక్టర్ అసిష్ సంగువాన్ స్పందించిన తీరు పట్ల గ్రామస్తులు హర్షం వ్యక్తం చేశారు.
విజయక్రాంతి కథనానికి గ్రామస్తులు కృతజ్ఞతలు తెలిపారు. గత 20 రోజులుగా ఇబ్బందులు పడుతున్న గ్రామస్తులకు విజయ క్రాంతిలో వచ్చిన కథనంతో వెంటనే జిల్లా కలెక్టర్ స్పందించడం వల్ల పురుగుల సమస్య తోలుగిందని గ్రామస్తులు తెలిపారు. గ్రామ కార్యదర్శి రాజు, జిల్లా పంచాయతీ అధికారి మురళి ఆగ మేఘాల మీద గోదాములలో నిల్వ ఉన్న బియ్యాన్ని తరలించాలని గోదాముల యజమానులను ఆదేశించారు. పురుగుల నివారణకు పిచికారి మందులు చేపట్టారు. తక్షణమే చర్య లు తీసుకోవడంతో కలెక్టర్కు గ్రామస్తులు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు పైడి జనార్ధన్, బి ఆర్ ఎస్ మండల పార్టీ అధ్యక్షులు బొల్లిపల్లి మహేందర్ రెడ్డి, గ్రామ విండో అధ్యక్షులు సదాశివరెడ్డి, గ్రామ అభివృద్ధి కమిటీ అధ్యక్షులు ముదాం. సత్యం, భూపతి, మోసార్ల. శ్రీకాంత్ రెడ్డి, రాజ్ కుమార్, చాకలి సంతోష్, గ్రామ యువకులు పాల్గొన్నారు.