calender_icon.png 16 August, 2025 | 10:36 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రక్తదానంతో ప్రాణాలను కాపాడవచ్చు

13-12-2024 02:57:45 PM

విద్యుత్ ఉద్యోగుల మెగా రక్తదాన శిబిరం 

కామారెడ్డి అదనపు కలెక్టర్ శ్రీనివాస్ రెడ్డి

కామారెడ్డి,(విజయక్రాంతి): రక్తదానం చేయడం వల్ల ఆపదలో ఉన్న వారి ప్రాణాలు కాపాడవచ్చు అని  కామారెడ్డి జిల్లా అదనపు కలెక్టర్ శ్రీనివాస్ రెడ్డి అన్నారు. సూపరిండెంట్ ఇంజనీర్  శ్రావణ్ కుమార్ ఆధ్వర్యంలో రెడ్ క్రాస్ సొసైటీ కామారెడ్డి జిల్లా సహకారంతో విద్యుత్ ఉద్యోగుల మెగా రక్తదాన శిబిరం శుక్రవారం విద్యుత్ శాఖ సర్కిల్ కార్యాలయం కామారెడ్డిలో విజయవంతంగా నిర్వహించారు.

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన జిల్లా అదనపు కలెక్టర్ శ్రీనివాస్ రెడ్డి , రక్తదానం చేయడం వల్ల పలు ప్రాణాలు కాపాడవచ్చునని, ఇది మన ఆరోగ్యానికి కూడా మేలును చేకూరుస్తుందన్నారు. ఇలాంటి కార్యక్రమాలను ప్రోత్సహించడం ద్వారా సమాజంలో సేవా భావం పెరుగుతుందని ప్రశంసించారు. ఈ కార్యక్రమంలో విద్యుత్ శాఖ ఉద్యోగులు స్వచ్చందంగా రక్తదానం చేసి, రక్తదానానికి ఉన్న ప్రత్యేకత గురించి తమ అభిప్రాయాలను వ్యక్తం చేశారు. రక్తదానం వల్ల పాత రక్తం తొలగి, శరీరంలో కొత్త రక్తం ఉత్పత్తి అవుతుందని, అందరూ రక్తదానాన్ని అలవాటు చేసుకోవాలని సూచించారు. 

ఈ కార్యక్రమంలో కామారెడ్డి జిల్లా విద్యుత్ శాఖ  సూపర్డెంట్ ఇంజనీర్ శ్రవణ్ కుమార్, రాజశేఖర్ డివిజనల్ ఇంజనీర్ లు, కళ్యాణ చక్రవర్తి,  నాగరాజ్, కిరణ్ చైతన్య, రెడ్ క్రాస్ ప్రతినిధులు రాజన్న, పీవీ. నరసింహారావు, యూనియన్ నాయకులు, విద్యుత్ ఉద్యోగులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఈ మెగా రక్తదాన శిబిరం విజయవంతంగా నిర్వహించడంలో సహకరించిన రెడ్ క్రాస్ సొసైటీ, విద్యుత్ శాఖ అధికారులు, ఉద్యోగులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.