calender_icon.png 17 August, 2025 | 12:46 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

గోపిక, కృష్ణుని వేషధారణలో ఆకట్టుకున్న చిన్నారులు

16-08-2025 10:35:18 PM

తూప్రాన్,(విజయక్రాంతి): తూప్రాన్ పట్టణంలో శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు ఎంతో ఘనంగా జరిగాయి, తూప్రాన్ పట్టణంలోని 5వ వార్డు విద్యానగర్ కాలనీలో శ్రీకృష్ణ జన్మాష్టమి  సందర్భంగా కాలనీలో దంతెపల్లి నిశ్చయ్, దంతేపల్లి విహన్స్,  దంతెపల్లి రుద్రాన్స్,  చిన్నారులకు శ్రీకృష్ణుని యొక్క వేషధారణ, దంతేపల్లి శ్రీయాన్సీకి గోపిక వేషాదరణ  వేయించి పిల్లల తల్లిదండ్రులు పిల్లలు చేసే అల్లరిని చూసి ఎంతగానో మురిసిపోయారు.

పిల్లలు కృష్ణుని వేషాధారణ వేసుకున్నందుగాను మాకు ఎంతగానో సంతోషంగా ఉందని తల్లిదండ్రులు తెలిపారు. శ్రీకృష్ణ జన్మాష్టమి, కృష్ణాష్టమి, గోకులాష్టమి, అష్టమి రోహిణి, శ్రీకృష్ణ జయంతి అని పిలుస్తుంటారు, ప్రతి సంవత్సరం శ్రావణమాసం కృష్ణ పక్షంలోని అష్టమి తిది, రోహిణి నక్షత్రంలో కృష్ణాష్టమి వేడుకలు జరుపుకుంటామని  విష్ణుమూర్తి పది అవతారాలలో ఎనిమిదవ అవతారంగా ద్వాపర యుగంలో శ్రీకృష్ణుడు జన్మించాడని పురాణాలు చెబుతున్నాయన్నారు.