16-08-2025 09:21:52 PM
లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి
కన్నాయిగూడెం తహశీల్దార్ ఎండీ సర్వర్
కన్నాయిగూడెం,(విజయక్రాంతి): ములుగు జిల్లా కన్నాయిగూడెం మండలంలోని తుపాకులగూడెం గ్రామంలో సమ్మక్క సాగర్ జలకళ సంతరించుకుంది. మూడు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు వరదలు ఎక్కువ కావడంతో కడెం ప్రాజెక్టు గేట్లు ఎత్తి నీళ్లను కిందకు వదిలేశారు. అందువలన కురుస్తున్న వర్షాల కారణంగా వరదలు ఎల్లంపల్లి ప్రాజెక్ట్, లక్ష్మీ (మేడిగడ్డ) బ్యారేజ్, తుపాకులగూడెం సమ్మక్క సాగర్ లోకి చేరిన నీరు 17.5మీటర్ల సామర్థ్యంతో నిండి జలకళతో ఉట్టిపడుతుంది. వరదలు ఎక్కువగా చేరే అవకాశం ఉంది.
సమ్మక్క సాగర్ లోకి వరద నీరు 3లక్షల 74వేల 430క్యూ చెక్కుల టిఎంసీల ఇన్ ఫ్లో నీరు వస్తోంది 59గేట్లు ఉండగా 58గేట్లు ఎత్తడంతో 3,95,860 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నమని దేవాదూల పంఫౌజ్ డీఈ చరత్ తెలిపారు. గోదావరి నది పరివాహక ప్రాంతంలోకి ఏ సమయంలో నైనా వరద నీరు వచ్చే అవకాశం ఉందని అన్నారు ఈసందర్భంగా కన్నాయిగూడెం తహశీల్దార్ ఎండీ సర్వర్ ఒక ప్రకటనలో మాట్లాడుతూ కన్నాయిగూడెం మండల దిగువ గోదావరి ప్రాంతాల ప్రజలు చేపలు పట్టేవారు,పశువుల కాపరులు,గోదావరి లోతట్టు ప్రాంతాలకు వెళ్లకుండా అప్రమత్తంగా ఉండాలని అన్నారు.