calender_icon.png 16 August, 2025 | 11:12 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నీటి గుంటలో పడి బాలుడు మృతి

16-08-2025 09:30:38 PM

గార్ల,(విజయక్రాంతి): మహబూబాబాద్ జిల్లా బయ్యారం మండల పరిధిలోని జగత్ రావు పేట గ్రామంలో ఇందిరమ్మ ఇంటి నిర్మాణంలో భాగంగా పిల్లర్ కొరకు తీసిన గుంటలో వర్షం నీటితో నిండింది. పిల్లలిద్దరూ ఆడుకుంటూ వెళ్లగా ప్రమాదవశాత్తు నీటి గుంతలో పడి వాంకుడోత్ చక్రి (7) మృతి చెందాడు. బాలుడితోపాటు మరో బాలిక పడిపోవడంతో బాలికను గుర్తించిన స్థానికులు త్వరితగతిన బయటకు తీయడంతో ప్రాణాపాయం తప్పింది. వాంకుడోత్ చక్రి తల్లిదండ్రులు వాంకుడోత్ జీవన్, మహాలక్ష్మి లు రోదిస్తున్న తీరు కంటతడి పెట్టించింది. మృతి చెందిన బాలుడి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మహబూబాబాద్ ఏరియా ఆసుపత్రికి తరలించి, బయ్యారం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.