calender_icon.png 16 August, 2025 | 11:12 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నాణ్యత లేని కల్వర్టు పనులు..

16-08-2025 09:26:36 PM

నాణ్యతతో చేపట్టాలని గ్రామస్తులు ఆగ్రహం..

కోనరావుపేట (విజయక్రాంతి): కోనరావుపేట మండల కేంద్రానికి వెళ్లే ప్రధాన రహదారిలో పైపులతో కూడిన కల్వర్టు నిర్మాణం పనులను నాణ్యతతో చేపట్టడం లేదని శనివారం మండల కేంద్ర వాసులు అడ్డుకున్నారు. కల్వర్టు పనుల్లో నాణ్యత ప్రమాణాలు పాటించడం లేదని పైపులు వేసిన తర్వాత పైపుల మధ్యలో కంకర సిమెంట్ కలిపి వేయాలి కానీ కాంట్రాక్టర్ రౌతులు మట్టితో నింపుతున్నారని ఆరోపించారు. సంబంధిత అధికారులు సందర్శించి నాణ్యతతో కూడిన పనులు చేపట్టాలని కాంట్రాక్టర్ పై చర్యలు తీసుకొని నాణ్యత పరిమాణాలతో కాల్వర్ట్ నిర్మాణం చేపట్టాలని లేనిపక్షంలో నిర్మాణం జరిగిన కొన్ని రోజులకే కల్వర్టు పాడవుతుందని పైపులు పగిలి పోతాయని దీంతో  ప్రమాదాలు జరుగుతాయని ఇకనైనా అధికారులు కాంట్రాక్టర్ తో కాల్వర్ట్ నిర్మాణం పనులు నాణ్యతతో చేపట్టాలని గ్రామస్తులు కోరారు.