16-08-2025 09:23:20 PM
యాదగిరిగుట్ట (విజయక్రాంతి): యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహ స్వామిని ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ శ్రీ రాజ్ నీష్ గుప్తా(Justice Shri Rajneesh Gupta) కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. ఆలయ కార్యనిర్వాహణ అధికారి శ్రీ వెంకట్రావు ఐఏఎస్ ఆధ్వర్యంలో అర్చకులు వారికి స్వాగతం పలికి దర్శనం ఏర్పాట్లు చేశారు. అనంతరం వేద ఆశీర్వచనం నిర్వహించి శ్రీ స్వామివారి లడ్డు ప్రసాదము జ్ఞాపికను బహుకరించారు. శ్రీ రాజ్ నీష్ గుప్తా కుటుంబ సమేతంగా స్వామివారిని దర్శించుకోవడం చాలా సంతోషంగా ఉందని ఆలయ పరిసరాలు చాలా అందంగా ఆహ్లాదంగా ఉన్నాయని తెలియజేశారు.