16-08-2025 09:47:30 PM
రాజకీయ వర్గాల్లో కలకలం రేపిన ఇందిరమ్మ ఇళ్ళు పంపిణీ వేదిక
ఒకే వేదికపై ముందుగా ఎమ్మెల్యే జగదీశ్రడ్డి, కార్పోరేషన్ చైర్మన్ పటేల్ రమేష్ రెడ్డి
కార్యక్రమం ముగిసిన తర్వాత పట్టాలు పంపిణి చేసిన మార్కెట్ చైర్మన్ వేణారెడ్డి
తలనొప్పిగా మారిందని గునుకుంటున్న అధికార యంత్రాంగం
పెన్ పహాడ్: మొన్న ఆత్మకూర్ (ఎస్) శనివారం పెన్ పహాడ్ మండలంలో నిర్వహించిన ఇందిరమ్మ ఇళ్ళు, నూతన రేషన్ కార్డుల పంపిణీ రాజకీయ వర్గాలలో కలకల రేపుతుందనే చెప్పవచ్చు. తాజాగా శనివారం సూర్యాపేట జిల్లా పెన్ పహాడ్ మండలంలోని అన్నారం బ్రిడ్జి గ్రామములోని ఓ పంక్షన్ హాల్లో నిర్వహించిన రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇళ్ల పట్టాల పంపిణి కార్యక్రమము ప్రజా ప్రయోజన పంపిణి కార్యక్రమమా.. లేదా రాజకీయ పోటీ వేదికా..ని రాజకీయ వర్గాలలో లబ్దిదారులలో కలకలం రేపింది.
ఏం జరిగిందంటే...
అధికారికంగా కార్యక్రమం మద్యాహ్నం 2గంటలకు ప్రకటించిగా సకాలంలో మొదట పర్యాటక శాఖ కార్పోరేషన్ చైర్మన్ పటేల్ రమేష్ రెడ్డి, మరో కొద్ది సేపటికి స్థానిక ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీశ్ రెడ్డి హాజరు అయ్యారు. ఈలోగా జిల్లా అధికారులు కార్యక్రమాన్ని ఉద్దేశ్యించి మాట్లాడారు. లబ్దిదారులు పెద్ద ఎత్తున రావడంతో మొదట రమేష్ రెడ్డి తన ప్రసంగాన్ని ప్రారంభించి స్వంత గృహం లేని ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్న గృహహీన కుటుంబాలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వారి జీవితాలలో కొత్త వెలుగులు నింపారని.. నిజంగా వీరికి పండుగ రోజని పెర్కోన్నారు.
ఆతర్వాత ఎమ్మెల్యే జగదీశ్ రెడ్డి మాట్లాడారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలు చేయక పోవడంతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కోంటున్నారని హామీలన్నీ అమలు చేస్తే తెలంగాణ ప్రజలంతా సంతోషకంగా ఉంటారని తెలిపారు. కార్యక్రమం అంతా అప్పటికి సజావుగానే సాగుతూ ఇరువురు ముఖ్య అతిధిలు కలసి లబ్దిదారులకు పంపిణి చేశారు. దీంతో కార్యక్రమము ముగిసిందని జిల్లా ఆర్డీఓ ప్రకటించడంతో తమ వహనంలో ఇంటి దారి పట్టారు. అంతేకాదు కొందరు ఇరు పార్టీల నాయకులు, ప్రజలు, లబ్దిదారులు ఇంటిదారి కూడా పట్టారు.
కాగా ముగిసిన పది నిమిషాలల వ్యవధిలో నియోజకవర్గంలో అధికార పార్టీకి చెందిన మార్కెట్ చైర్మన్ కొప్పుల వేణారెడ్డి తన అనుచరులతో ర్యాలీగా కార్యక్రమ ప్రాంగణానికి చేరుకున్నారు. కార్యక్రమాన్ని తాను రాకముందే ముగించడం పట్ల ఆయన అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. తాను వస్తున్నాననే తెలిసి కార్యక్రమాన్ని అర్దాంతంరంగా ముగించడం వెనుక ఎమ్మెల్యే జగదీశ్ రెడ్డి కుట్ర ఉందని, అందుకు తమ పార్టీలో కొందరు కొమ్ము కాయడం సిగ్గు చేటని వేణారెడ్డి మండిపడ్డారు. ఆతర్వాత ఉన్న అధికారులతో ఆయా గ్రామాల లబ్దిదారులకు మరోసారి పట్టాలు పంపిణి చేశారు. దీంతో అధికారులకు, లబ్దిదారులకు ఆశ్చర్యం కలిగించింది.
ఆయా రాజకీయ పార్టీల వర్గాలలో ఒకే వేదికపై జరిగిన రెండు సార్లు లబ్దిదారుల పంపిణి కార్యక్రమములో ప్రోటో కాల్ గల్లంతైందా లేదా రాజకీయ కుట్ర దాపురించిందా..ని పలువురు మేధావులు, రాజకీయ వర్గాలు, ప్రజలు అయోమయంలో పడ్డారు. కాగా ఇటీవల జరిగిన ఆత్మకూర్ (ఎస్) వేదికలో జరిగిన లాఠీ చార్జీ పెన్ పహాడ్ లో పునఃరావృత్తం కావద్దని ముందస్తుగానే పోలీసులు, పారామెటికల్ దళాలు పెద్ద ఎత్తున రాగ ఒకే వేదికలో ఇరువురు తారాస పడక పోవడంతో వేర్వేరుగా పట్టాల పంపిణి జరగడం.. అమ్మయ్యా.. లాఠీచార్జీ చేతులకు పని కల్పించలేదని అధికారులు, పోలీసూ గునుక్కోవడం కనిపించింది.