calender_icon.png 16 August, 2025 | 11:16 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఎల్లంపల్లి ప్రాజెక్టు 20 గేట్లు ఎత్తిన అధికారులు

16-08-2025 09:28:03 PM

మంచిర్యాల (విజయక్రాంతి): మంచిర్యాల జిల్లా(Mancherial District) గుడిపేట మండలంలోని శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టుకు ఇన్ ఫ్లో పెరుగుతుండటంతో ప్రాజెక్టు 20 గేట్లు ఎత్తి నీటిని కిందికి వదులుతున్నారు. ప్రాజెక్టు లెవల్ 148 మీటర్లు కాగా 147.12 మీటర్లకు నీరు చేరుకుంది. ప్రాజెక్టు నీటి సామర్థ్యం 20.175 టీఎంసీలకు 17.7303 టీఎంసీల నీరు నిలిచి ఉంది. ఎగువన కురిసిన వర్షాలతో వరద రూపంలో ప్రాజెక్టుకు 54,366 క్యూసెక్కులు, కడెం ప్రాజెక్టు గేట్లు ఎత్తడంవల్ల 1,61,135 క్యూసెక్కుల నీరు వస్తుండటంతో ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు సాయంత్రం 10 గేట్లు ఎత్తిన అధికారులు, ప్రస్తుతం 20 గేట్లు ఎత్తి దిగువ గోదావరిలోకి మూడు లక్షల క్యూసెక్కుల నీటిని వదిలారు. ప్రాజెక్టు దిగువన ఉన్న గోదావరి తీర ప్రాంత ప్రజలను పోలీసులు, రెవెన్యూ అదికారులు అలర్ట్ చేశారు.