16-08-2025 09:38:59 PM
మంత్రి ఉత్తమ్ సహకారంతోనే అభివృద్ధి సాధ్యం
గరిడేపల్లి,(విజయక్రాంతి): ఆపదలో పేదలను సీఎం రిలిఫ్ ఫండ్ ఆదుకుంటుందని మండల కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ మూలగుండ్ల సీతారాంరెడ్డి అన్నారు. శనివారం గరిడేపల్లి మండలం కల్మల్ చెరువు గ్రామంలో అనారోగ్య కారణంగా ఇబ్బందులు పడుతున్న ఏడుగురు బాధితులకు ఆర్ధిక సహాయం కింద రూ.2,84,500లను గ్రామ శాఖ అధ్యక్షుడు యోహాన్ ఆధ్వర్యంలో మండల వర్కింగ్ ప్రెసిడెంట్ సీతారాంరెడ్డి, మాజీ జెడ్పిటిసి బచ్చలకూరి మట్టయ్య చేతుల మీదుగా అందించినట్లు తెలిపారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... ముఖ్యమంత్రి సహాయనిధి ద్వారా అనేకమంది నిరుపేద కుటుంబాలను ఆదుకోవడం జరిగిందన్నారు. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సహాయ సహకారాలతో గ్రామం అభివృద్ధి పథంలో నడుస్తుదన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతి కార్యకర్తను కడుపులో పెట్టుకొని కాపాడుకుంటుందన్నారు. భవిష్యత్‌లో కూడా మండలంలో ఆరోగ్య సమస్యలతో సతమతమవుతున్న నిరుపేదలకు అండగా ఉంటామన్నారు. అంతేకాకుండా వారికి కార్పొరేటు వైద్యం అందించడం జరుగుతుందన్నారు.