27-10-2025 01:08:59 AM
కరీంనగర్, అక్టోబర్26(విజయక్రాంతి):పేగు బంధం కాదు ఇది, రక్తసంబంధం అసలే కాదు,కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీనివాసుని పేరు బంధం సామాజిక సేవా సంబంధం నలుగురు నడిస్తే తోవ అదే శ్రీనివాసులు నడిస్తే సేవ. ఈ క్తమంలోనే శ్రీనివాస్ నామకరణం తో ఉన్నవారంతా ఒక్కటయ్యారు. కరీంనగర్‌లోని ఓ ప్రైవేట్ ఫంక్షన్ హాలులో 2000 మందికి పైగా శ్రీనివాసులు సమావేశమైనారు. సమాజానికి సేవ చేసే దిశగా ముందుకు పోవాలని నిర్ణయించుకున్నారు.