27-07-2025 06:19:13 PM
కొత్తపల్లి (విజయక్రాంతి): హమ్ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో స్థానిక 30వ డివిజన్ వరాహస్వామి గుడి పరిసర ప్రాంతంలో హరితహారంలో భాగంగా మొక్కలు నాటడం జరిగింది. ఈ సందర్భంగా సంస్థ వ్యవస్థపక అధ్యక్షులు ధనపురి సాగర్ మాట్లాడుతూ, ప్రతి వర్షకాలంలో మా సంస్థ తరఫున మొక్కలు నాటడం జరుగుతుంది. అందులో భాగంగా ఈరోజు గుడి పరిసర ప్రాంతాలలో నీడనిచ్చే మొక్కలను నాటడం జరిగిందని తెలిపారు. పర్యావరణ పరిరక్షణ అందరి బాధ్యత, ప్రతి ఒక్కరూ తమ వంతుగా మొక్కలు నాటి, వాటిని సంరక్షించాలి అని పేర్కొన్నారు. అలాగే ప్రజల్లో గ్రీన్ చైతన్యాన్ని పెంచేందుకు సంస్థ తరఫున మరిన్ని కార్యక్రమాలు చేపడతామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో సంస్థ ట్రెజరీ తొడుపునూరి తిరుపతి, సభ్యులు ఏ.అనిల్ కుమార్ మరియు ముని గోపాల్ పాల్గొన్నారు.