27-07-2025 08:53:49 PM
సిపిఎం జిల్లా కార్యదర్శి సంకె రవి..
మందమర్రి (విజయక్రాంతి): పట్టణంలోని వివిధ కాలనీలలో విద్యుత్ తీగలతో ఆనుకొని ప్రమాదకరంగా ఉన్న చెట్టు కొమ్మలను తొలగించాలని సిపిఎం జిల్లా కార్యదర్శి సంకె రవి(CPM District Secretary Sanke Ravi) డిమాండ్ చేశారు. ఆదివారం ఆయన సిపిఎం మండల కార్యదర్శి దూలం శ్రీనివాస్ తో కలిసి పట్టణంలోని దొరల బంగ్లా, రామకృష్ణాపూర్(వి)లో కూడా పర్యటించి మాట్లాడారు. రహదారి వెంట ఉన్న విద్యుత్ తీగలపై చెట్ల కొమ్మలు ప్రమాదకరంగా మారి, ఎప్పుడు ప్రమాదం జరుగుతుందని కాలనీవాసులు ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. విద్యుత్ తీగలపై ప్రమాదకరమైన చెట్ల కొమ్ములు పెరిగి ఎప్పుడు ఏం జరుగుతుందనే భయాందోళనలో ప్రజలు బిక్కుబిక్కుమంటూ జీవిస్తున్నారని తెలిపారు.
చెట్ల కొమ్మలు విరిగిపడితే సుమారు 10 విద్యుత్ స్తంభాలు విరిగిపోయి, రెండు నుంచి మూడు లక్షల రూపాయల నష్ట జరగడంతో పాటు ప్రజలకు ప్రాణాలకు సైతం హాని కలుగుతుందని, అయినప్పటికీ విద్యుత్ అధికారులు తమకేమీ సంబంధం లేనట్టుగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. ఇక్కడి ప్రజలు పదేపదే అధికారుల దృష్టికి తీసుకువెళ్లిన ఫలితం శూన్యమన్నారు. చెట్ల కొమ్మలను తొలగించి, రాబోయే ప్రమాదాన్ని నివారించి, ప్రజలకు నిరంతరం విద్యుత్ సరఫరా చేసే బాధ్యత విద్యుత్ అధికారులదే అని స్పష్టం చేశారు. ఇప్పటికైనా విద్యుత్ అధికారులు స్పందించి, చెట్ల కొమ్ములను తొలగించుకుంటే సిపిఎం ఆధ్వర్యంలో ఆందోళన నిర్వహిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆయా కాలనీవాసులు పాల్గొన్నారు.