calender_icon.png 27 July, 2025 | 9:28 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మోడర్న్ డైరీ పార్లర్ ప్రారంభోత్సవం

27-07-2025 06:16:31 PM

ప్రారంభించిన తుంగతుర్తి రవి..

మేడిపల్లి: పీర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని బిఎస్ఎన్ఎల్ కాలనీలో నూతనంగా ఏర్పాటు చేసిన మోడర్న్ డైరీ పార్లర్ ప్రారంభోత్సవ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి  ముఖ్య అతిథిగా కార్పొరేషన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు తుంగతుర్తి రవి(Congress Party President Thungathurthi Ravi) హాజరై పార్లర్‌ను ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ... పాల ఉత్పత్తులు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయని. నాణ్యమైన పాలు, పాల ఉత్పత్తులు అందుబాటులోకి రావడం ఆరోగ్యకరమని, సమాజానికి బలాన్ని ఇస్తాయని, చిన్న స్థాయి వ్యాపారాలు స్థానిక యువతకు ఉపాధి అవకాశాలను కల్పించడమే కాక, ఆర్థికంగా స్థానిక యువతను ప్రోత్సహిస్తూ, చిన్న వ్యాపారాల ద్వారా సమాజ అభివృద్ధిలో భాగస్వాములు కావాలని అన్నారు. ఈ కార్యక్రమంలో మోహన్ కుమార్, మహేష్, మల్లేష్, తిరుమలేష్, అరుణ్ తదితరులు పాల్గొన్నారు.