calender_icon.png 27 July, 2025 | 11:28 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పేకాట స్థావరంపై దాడి

27-07-2025 08:39:58 PM

ఏడుగురు పేకాట రాయుళ్ల అరెస్ట్..

38,150 రూపాయల నగదు, 6 సెల్ ఫోన్లు, రెండు ద్విచక్ర వాహనాలు స్వాధీనం..

మందమర్రి (విజయక్రాంతి): పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలోని శాంతినగర్ లోని శివ అనే వ్యక్తి ఇంట్లో పేకాట ఆడుతున్నారనే విశ్వసనీయ సమాచారం మేరకు ఆదివారం పేకాట స్థావరంపై పట్టణ పోలీసులు దాడి చేసి, పేకాటరాయుళ్లను అదుపులోకి తీసుకున్నామని పట్టణ ఎస్ఐ ఎస్ రాజశేఖర్(SI Rajasekhar) తెలిపారు. ఈ దాడిలో పేకాట ఆడుతున్న ఏడుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకోగా, వారి వద్ద నుండి 38,150 రూపాయల నగదు, 6 మొబైల్ ఫోన్ లు, రెండు ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకుని, వాటిని సీజ్ చేయడం జరిగిందని తెలిపారు. అదేవిధంగా తన నివాసంలో పేకాట ఆడేందుకు అనుమతి ఇచ్చి, వారి నుండి కమిషన్ వసూలు చేస్తున్న ఇంటి యజమాని శివపై కేసు నమోదు చేశామన్నారు.

అరెస్టు అయిన వారిలో పట్టణంలోని పాలచెట్టు ఏరియాకు చెందిన కట్టా దుర్గారావు, బెల్లంపల్లి పట్టణంలోని బూడిదగడ్డ బస్తీకి చెందిన దాసరి నర్సయ్య, పట్టణంలోని విద్యానగర్ కు చెందిన పుడమ శివ, గరిక కుమార్, రామన్ కాలనీ కి చెందిన మేకల రాజశేఖర్, మారుతి నగర్ కు చెందిన కట్టా రమణ, విద్యానగర్ కు చెందిన తన్నీరు రవి లు ఉన్నారు. పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలో అసాంఘిక కార్యకలాపాలపై ఉక్కుపాదం మోపుతున్నా మని తెలిపారు. పోలీస్ ఉన్నతాధికారుల ఆదేశాలతో అక్రమ, అసాంఘిక కార్యాలయాలపై నిఘా పటిష్టం చేసి, పక్కా సమాచారంతో దాడులు నిర్వహిస్తున్నామన్నారు. ఈసందర్భంగా ఈ ఆపరేషన్ లో చాకచక్యంగా వ్యవహరించి నిందితులను పట్టుకున్న పట్టణ ఎస్ఐ ఎస్ రాజశేఖర్, ఏఎస్ఐ మిలింద్ కుమార్, కానిస్టేబుల్ లు శ్రీనివాస్, రాకేష్, విశ్వనాథ్, కృష్ణ, చైతన్య లను పట్టణ సిఐ కే శశిధర్ రెడ్డి అభినందించారు.