27-07-2025 08:44:38 PM
మహబూబాబాద్ (విజయక్రాంతి): ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు లభించే విధంగా భారత రాజ్యాంగాన్ని రచించిన డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ స్ఫూర్తితో, భారతదేశ ఖ్యాతిని ప్రపంచ నలుమూలల చాటే విధంగా యువత ముందుకు సాగాలని పలువురు వక్తలు పేర్కొన్నారు. మహబూబాబాద్ జిల్లా మాధవపురంలో ఏర్పాటుచేసిన డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్, బాబు జగ్జీవన్ రామ్ విగ్రహాలను మహబూబాబాద్ ఎంపీ పోరిక బలరాం నాయక్(MP Porika Balram Naik), ఎమ్మెల్యే డాక్టర్ భూక్యా మురళి నాయక్(MLA Dr. Bhukya Murali Naik), మాజీ ఎంపీ రామ సహాయం సురేందర్ రెడ్డి, వివిధ సంఘాల ప్రతినిధులు ఆవిష్కరించారు. రాజ్యాంగ స్ఫూర్తితో ప్రతి ఒక్కరూ వారి ఆశయ సాధనకు కృషి చేయాలని పిలుపునిచ్చారు.