27-07-2025 08:21:43 PM
దౌల్తాబాద్ (విజయక్రాంతి): రాయపోల్ మండల కేంద్రానికి చెందిన బీఆర్ఎస్ సీనియర్ నాయకులు గల్వ జీవన్ రెడ్డి సోదరుడు గల్వ సత్తిరెడ్డి గత నాలుగు రోజుల క్రితం నార్సింగ్ మండలం వల్లూరు వద్ద లారీ ఢీకొట్టి మృతిచెందగా, బాధిత కుటుంబాన్ని ఆదివారం దుబ్బాక ఎమ్మల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి(MLA Kotha Prabhakar Reddy), రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య, బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు సోలిపేట సతిష్ రెడ్డిలతో కలిసి పరామర్శించారు. చిన్న వయస్సులోనే సత్తిరెడ్డి మృతి చెందడం పట్ల ఆయన విచారం వ్యక్తం చేశారు.
బాధిత కుటుంబానికి తమ వంతు సహాయ సహకరాలు ఎల్లప్పుడు అందిస్తామని ఆయన హామీ ఇచ్చారు. అనంతరం మండల కేంద్రానికి చెందిన సీనియర్ కార్యకర్త గౌరిగారి పరుశురాములు తల్లి ఇటీవల మృతి చెందగా వారి కుటుంబ సభ్యులను పరామర్శించి వోదార్చారు. కార్యకర్తల కుటుబాలకు తాము ఎల్లప్పుడు అండగా ఉంటామని పేర్కొన్నారు. ఆయన వెంట బీఆర్ఎస్ నియోజకవర్గ బీసీ సమన్వయ కర్త రణం శ్రీనివాస్ గౌడ్, రాయపోల్ మాజీ జడ్పీటీసీ యాదగిరి, నాయకులు ఇప్ప దయాకర్,వెంకట్ గౌడ్, గల్వ దయాకర్ రెడ్డి, రంగారెడ్డి, విష్ణువర్ధన్ రెడ్డి, బాల్ రెడ్డి, లక్మారెడ్డి, రాజిరెడ్డి, యాదవరెడ్డి, మహ్మద్ ఎగ్బాల్, రాజు, స్వామి తదితరులు ఉన్నారు.