08-07-2025 04:47:34 PM
భద్రాద్రి కొత్తగూడెం (విజయక్రాంతి): కొత్తగూడెం మండలంలో గల సకల ప్రభుత్వ పాఠశాలలకు దేశ ప్రముఖులతో కూడిన పటాన్ని కొత్తగూడెం మండల విద్యాశాఖ అధికారి డాక్టర్ ప్రభుదయాల్(Mandal Education Officer Dr. Prabhu Dayal) మంగళవారం అందజేశారు. చదువుతో పాటు దేశ ప్రముఖులు చేసిన సేవలను వారి ఉన్నత వ్యక్తిత్వాన్ని విద్యార్థులకు తెలియజేస్తూ, దేశభక్తి భావాలతో పాటు, జాతీయ సమైక్యత విలువలను పెంపొందించాలని కోరారు.
సదరు చిత్ర మాలికలో సూక్తులను ముద్రించారు. చదువుతో పాటు సంస్కారం, భావ సమైక్యత జాతీయ భావాలను పెంపొందించాలన్నారు. వారం వారం ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహిస్తూ మహాత్ములు, మహానుభావులు చేసిన గొప్ప సేవను వారి మూర్తిమత్వ లక్షణాలను వివరిస్తూ ఈ విద్యార్థుల్లో అవగాహన కల్పించాలన్నారు. ఈ ప్రత్యేక కార్యక్రమంలో పాఠశాలల హెచ్ఎం లు, సిఆర్పిలు, ఎంఆర్సిసి సిబ్బంది పాల్గొన్నారు.