calender_icon.png 8 July, 2025 | 9:52 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

షరతులు లేకుండా దళితబంధు రెండో విడత నిధులు విడుదల చేయాలి

08-07-2025 04:44:44 PM

బిజెపి పట్టణ అధ్యక్షుడు తూర్పాటి రాజు...

హుజరాబాద్ (విజయక్రాంతి): దళితబంధు రెండో విడత నిధులు ఎలాంటి షరతులు లేకుండా విడుదల చేయాలని బిజెపి పట్టణ అధ్యక్షుడు తుర్పాటి రాజు(BJP City President Turpati Raju) అన్నారు. కరీంనగర్ జిల్లా హుజరాబాద్ పట్టణంలోని రెవెన్యూ కార్యాలయంలో సోమవారం నిరసన తెలిపి ఆర్డిఓ ఏవో భాస్కర్ కి వినతి పత్రం అందజేశారు. సందర్భంగా ఆయన మాట్లాడుతూ... దళితులను కాంగ్రెస్ ప్రభుత్వం రాజకీయంగా వాడుకుంటుందన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలవడం కొరకే కాంగ్రెస్ ప్రభుత్వం దళితబంధు డ్రామాలు ఆడుతుందన్నారు.

దళితబంధు మంజూరు కాకుండా బిఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి(MLA Kaushik Reddy) చేసినవంటి తప్పిదాన్నే కాంగ్రెస్ పార్టీ కొనసాగిస్తుందన్నారు. రెండో విడత నిధులు విడుదలయ్యే సమయానికి ఆలస్యమై 23 అసెంబ్లీ ఎన్నికలు నోటిఫికేషన్ కారణంగా నిలిచిపోయిందన్నారు. దళితబంధు ఎర్రగా చూపి గత బిఆర్ఎస్ ప్రభుత్వం, ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం దళితులను ఓటు బ్యాంకుగా వాడుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. దళితబంధు విడుదల కాకుండా అడ్డుపడితే దళితుల అగ్రహానికి గురికాక తప్పదని హెచ్చరించారు. కార్యక్రమంలో గంగిశెట్టి ప్రభాకర్, నల్ల సుమన్,  శ్రీనివాస్, ఏం సాని శశిధర్, పవన్, చంద్రిక, వెంకటేష్,రాజేష్, రాజు తో పాటు తదితరులు పాల్గొన్నారు.