calender_icon.png 9 July, 2025 | 5:00 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

వ్యవసాయానికి, గ్రామానికి వేరువేరుగా కొత్త బ్రేకర్ ఏర్పాటుతో విద్యుత్ కష్టాలు తీరుతాయి

08-07-2025 10:54:04 PM

ముత్తారం మండలంలో ట్రాన్స్ఫార్మర్లకు బ్రేకర్ల ప్రారంభంలో ట్రాన్స్-కో ఎస్ఈ గంగాధర్..

ముత్తారం (విజయక్రాంతి): వ్యవసాయానికి, గ్రామానికి వేరువేరుగా కొత్త బ్రేకర్ ఏర్పాటుతో ఇటు రైతులకు అటు గ్రామాల ప్రజలకు విద్యుత్ కష్టాలు తీరుతాయని ట్రాన్స్-కో ఎస్ఈ గంగాధర్(Trans-Co SE Gangadhar) తెలిపారు. మంగళవారం మండలంలోని ఖమ్మంపల్లి, అడవి శ్రీరాంపూర్ సబ్ స్టేషన్ లలో ట్రాన్స్ఫార్మర్లకు కొత్తగా బ్రేకర్ లను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... రైతులకు వ్యవసాయం చేయడానికి విద్యుత్ కోతలు లేకుండా ట్రాన్స్ఫార్మర్లకు వేరువేరుగా బ్రేకర్లు ఏర్పాటు చేస్తున్నామని, దీంతో రైతులకు గ్రామాలలోని ప్రజలకు విద్యుత్ అంతరాయం ఉండదని తెలిపారు. దీంతో రైతులకు విద్యుత్ కష్టాలు తీరుతాయన్నారు. ఈ కార్యక్రమంలో మంథని డీఈ ప్రభాకర్, ఏడీఏ కనుకయ్య సిబ్బంది కుమారస్వామి తదితరులు పాల్గొన్నారు.