08-07-2025 10:38:55 PM
ఖమ్మం (విజయక్రాంతి): ట్రాన్స్కో డైరెక్టర్(Director of Transco)గా ఇటీవల బాధ్యతలు చేపట్టిన సి ప్రభాకర్ రావు మంగళవారం ఖమ్మం జిల్లా పర్యటనకు వచ్చారు. జిల్లా ట్రాన్స్కో అధికారులు జిల్లా సూపరింటెండెంట్ ఇంజనీర్ ఇనుగుర్తి శ్రీనివాస చారి ఆధ్వర్యంలో డిఇ లు రామారావు, నాగేశ్వరరావు బాబురావు, వెంకటేశ్వర్లు, రాములు, బద్రు పవర్, ఏడిఇ లు కిరణ్ చక్రవర్తి, యాదగిరిలు, వివిధ యూనియన్ నాయకులు, సంఘాల నాయకులు తదితరులు కలిసి పుష్పగుచ్చాలు అందజేశారు. అనంతరం నియోజకవర్గాల వారీగా సమీక్ష నిర్వహించి వారి అభిప్రాయాలను తీసుకోవడం జరిగింది.