08-07-2025 10:43:12 PM
అనంతగిరి: అనంతగిరి మహిళా సమాఖ్య కార్యాలయంలో ఇందిరా మహిళా సంబరాలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఇన్చార్జ్ ఎంపీడీవో రామచంద్రరావు(In-charge MPDO Ramachandra Rao) హాజరై కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడారు. అనంతగిరి మండలంలో నూతన స్వయం సహాయక బృందాల నిర్మాణంలో ప్రతి ఇంటి నుండి మహిళను స్వయం సహాయక బృందంలో చేర్పించాలని సూచించారు. 15 ఏళ్ల నుండి 18 ఏళ్ళు కలిగిన కిశోర బాలికలతో కూడా స్వయం సహాయక బృందాలను నిర్మించి వారికి శిక్షణ ఇచ్చి అందరిని నాయకురాలిగా తీర్చిదిద్దాలని కోరారు. సంస్టగత్ నిర్మాణములో శిక్షణను ఇప్పించి స్వయం సహాయక బృందం సభ్యురాలు అందరూ కూడా ఫైనాన్షియల్ ఇన్క్లూజన్ లో లోన్స్ తీసుకోవాలన్నారు.
మళ్ళీ రికవరీ కూడా సక్రమంగా చేయాలనీ, తీసుకున్న లోన్స్ తో సరికొత్త ఆలోచనలతో కొత్తగా వినూత్నంగా మంచి ఉపాధి యూనిట్లను ఏర్పాటు చేసుకుంటూ ఆర్థికంగా ముందుకు పోతూ మహిళలందరినీ కోటీశ్వరులుగా తీర్చిదిద్దే యజ్ఞంలో భాగస్వామం కావాలని ఆయన పేర్కొన్నారు. ఎమ్మెస్, వివో, ఎస్ హెచ్ జిలలోని నాయకురాలు తప్పకుండా బాధ్యతలు కలిగి వుండాలనీ ఎక్కడ కూడా సిబ్బంది ద్వారా లేదా ఇతర వ్యక్తుల ద్వారా ఎటువంటి అవకతవకలకు ఆస్కారం లేకుండా చూసుకొని ప్రతి పేద నిరుపేద మహిళలని కోటీశ్వరులుగా తీర్చిద్దుకోవాలని ఈ సందర్భంగా వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏపిఎం లక్ష్మి, సీసీ, వివోఏలు, ఎమ్మెస్ ఓబి లు, వివో ఓ బి లు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.